పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జన్మదినలేఖ

17


కొంటిమి. పృథివి విపులమైనది. మన లోకమున కావల వింతలోకము లెన్నోకలవు. కాన క్రొత్త విషయములు నేర్చుకొనుటకు మనకు విసుగు జనించరాదు. యుఁవాన్‌చ్వాంగ్ చెప్పిన కథలోని గర్వియగు తెలివి తక్కువ పురుషునివలె తెలియదగిన సర్వమును తెలిసితిమనియు, పండితుల మైతిమనియు ఆనుకొనరాదు. మనము మిక్కిలి తెలివిగలవార మగుటకూడ కోరదగ్గదికాదు. అట్టివారెవరైన నున్నచో, ఇక తెలిసికో దగిన దేదియు లేదుకదా యని వారు విచారగ్రస్తులు కాకతప్పదు. క్రొత్త విషయములను కనిపెట్టుటలోను, క్రొత్తవిషయములను గురించి నేర్చు కొనుటలోను గల యానందమునకు వారు చూరు లగుదురు. కోరినచో నట్టి యానందము మనకు చిక్కునుగదా !

కాబట్టి నే నుపదేశములు చేయరాదు. అయిన నే నేమి చేయవలసి యుండును? జాబు ప్రసంగమువంటిది గాదు, జాబులో ఒక్కరి భావములే వెల్లడియగును. కాన నేను చెప్పు విషయములలో మంచి సలహాలవలె తోచు విషయ ముండిన దానిని పరిహరించుము. మ్రింగరాని చెడ్డ మాత్రవలె దానిని పరిహరించుము. మన ముభయులము ప్రసంగించు కొనుచున్నట్టే యూహించి, అట్టి విషయములు నేను నీకు నీవాలోచించు కొనుటకై చేసిన సూచనలుగా భావించుము.

జాతులు తమ జీవితములో గొప్పయౌన్నత్యముచెందిన కాలముల గూర్చియు, గొప్పపురుషులనుగూర్చియు, స్త్రీలనుగూర్చియు, వారు చేసిన గొప్ప కార్యములనుగూర్చియు మనము చరిత్రలో చదువుదుము. ఒక్కోక్కప్పుడు ఆయాకాలములందు మన మున్నట్లును ప్రాచీనవీరపురుషుల వలెను. వీరనారులవలెనుసాహసకార్యములు చేయుచున్నట్లును ఊహించు కొని కలలు గనుచుందుము. నీవు మొట్ట మొదట జిన్‌డఆర్ ను గురించి చదివినప్పుడు ఎంతటి యానందమును జెందితివో జ్ఞాపకమున్నదా? ఆమెవలె నీ వుండవలెనని యువ్విళ్ళూరితివిగదా! సామాన్య స్త్రీ పురుషులు సాధారణముగా వీరులుకారు. తిండినిగూర్చి, పిల్లలనుగూర్చి, సంసారపు