పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

ప్రపంచ చరిత్ర


గడపెను. యుఁవాన్‌చ్వాంగ్ విద్యాధికుడాయెను. అతనికి ధర్మాచార్యుడను బిరుదము లభించెను.ఇట ధర్మమన బౌద్దధర్మమని యభిప్రాయము. అతడు హిందూదేశమంతయు తిరిగెను. ఆ కాలమున నీదేశమున నివసించు ప్రజల నాతడు చూచెను. వారినిగురించి తెలిసికొనెను. తరువాత నాతడు తన యాత్రలనుగూర్చి యొక గ్రంథమును రచించెను. నాకు జ్ఞాపకమువచ్చిన కథ ఈ గ్రంథములో నుస్నది. దక్షిణ హిందూదేశమునుండి ఒకపురుషుడు కర్ణసువర్ణ నగరమునకు వచ్చెను. బీహారు రాష్ట్రమున నేడు భగల్పూరున్న చోటికి సమీపమున ఆ కర్ణసువర్ణ నగర ముండెను. ఇతడు నడుముచుట్టును రాగిరేకులు ధరించియుండెను, తలపై వెలుగుచున్న జ్యోతిని పెట్టుకొనెను. దండమును చేతబూని, సగర్వముగా, గంభీరముగా నాతి డీవింత దుస్తులతో తిరుగుచుండెను. ఇట్టి వికృత వేషముసకు కారణ మెవ్వరైన అడిగిన నాతడు చెప్పు సమాధాన మేఘన - నేనెంతో విద్యావంతుడను. అందుచే నాకడుపు పగులు నను భయముచే నడుముచుట్టును రాగిరేకులు బిగించితిని. మూర్ఖులగు ప్రజలు ఆంధకారమున మునిగియుండుటచే జాలిజెంది తలపై జ్యోతిని పెట్టుకొంటిని. అయితే, తెలివి అధికమై పగిలిపోవుదు నేమోయన్న భయము నాకులేదు. కాబట్టి రాగిరేకులనుగాని, కవచమునుగాని ధరించవలసిన అవసరము నాకు లేదు. అయినను నాకున్న తెలివితేటలు నాకడుపులో లేవు. అవి ఎక్కడ వున్నను. అధికమునకు ఇంకసు ఎంతో చోటున్నది. చోటు లేకపోవుట యను సందర్భ మెప్పటికి నుండదు. తెలివితేటలు ఇట్లు పరిమితముగా నున్నప్పుడు, నేను జ్ఞానవంతుడనని ఎట్లు చెప్పుకో గలను? ఇతరులకెట్లు సదుపదేశములను చేయగలను? న్యాయాన్యాయములను, కర్తవ్యాక ర్తవ్యములను నిర్ణయించుటకు ఉపదేశములు చేయుట సరియైన మార్గము కాదవియు, ప్రసంగించుట, చర్చించుటవల్లనే నిజము బయల్పడుననియు నానమ్మకము. నీతో చేసిన ప్రసంగములు నా ఇష్టమైనవి. మన మెన్నో విషయములు ముచ్చటించుకొంటిమి. చర్చించు