పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము

13


పైపైని స్పృశించుచు చెప్పుకొనిపోయిన సంక్షేపచారిత్రక విషయములు మాత్రమే. రకరకముల గ్రంథములనుండి నేను నా అభిప్రాయములను, యదార్థవిషయములను సంగ్రహించితిని. అనేక దోషము లిందు వచ్చి పడ్డవి. సమర్దుడగు చరిత్రజ్ఞునిచే ఈ జాబులను చదివించి సరిచేయించవలె నని నా ప్రథమోద్దేశము. కాని నేను కారాగారము విడిచి బయటనున్నది కొద్దికాలమే అగుటచే అట్టి ఏర్పాట్లు చేయుటకు నాకు సావకాశము చిక్కలేదు.

ఈ జాబులలో నేను తరుచు నా అభిప్రాయములను నిర్మొగమాటముగా, ఖచ్చితముగా చెప్పియుంటిని. ఆ యభిప్రాయములు సరియైన వనియే నా యభిప్రాయము. కాని నే నీజాబులు వ్రాయుచున్నప్పుడే చరిత్రనుగూర్చిన నాయభిప్రాయములు క్రమముగా మారజొచ్చెను. నేడు అవి మరల వ్రాయవలసివచ్చినయెడల వేరొక విధముగా వ్రాయుదును. లేదా, వేరువిషయములకు ప్రాధాన్యము నిత్తును. కాని వ్రాసినదానిని చింపివేసి మరల వ్రాయజాలను.

జనవరి 1, 1934.

జవహర్‌లాల్ నెహ్రూ

పై వాక్యములు శ్రీ జవహర్లాల్ నెహ్రూ 1934 వ సంవత్సరమున వ్రాసియుండిరి.

తరువాత 1934 వ సంవత్సరమున నీ గ్రంథము తిరిగి ఇంగ్లాండులో ముద్రింపబడినది. అది జరుగుటకు ముందు గ్రంథకర్త గ్రంథము నంతయు సరిచూచెను. చాలభాగము తిరిగి వ్రాసెను. ఇందలి చరిత్రకథ 1938 సంవత్సరాంతముపరకు గ్రంథకర్తయే వ్రాసెను. ఈ కార్యములన్నియు కారాగారము వెలుపల నున్నప్పుడే జరిగినవి. ఉపోద్ఘాతములో దొరలినవని చెప్పిన దోషములన్నియు తొలగింపబడినవనుట స్పష్టము .

1939-వ సంవత్సరమున ప్రకటింపబడిన గ్రంథమునకే ఈ యనువాదము.

అనువాదకుడు