పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

ప్రపంచ చరిత్ర


గ్రంథములు కారాగారబద్దుని వశమునం దుండవు. ఈ సందర్భములలో ఏ విషయమునుగూర్చి వ్రాయుట యన్నను, ఆందు ముఖ్యముగా చరిత్రను గూర్చి వ్రాయుట తెలివితక్కువ. సాహసముతో కూడుకొన్న పని. నా వద్దకు కొన్ని గ్రంథములు వచ్చెను. కాని వాటిని నావద్దనుంచుకొనుటకు వీలు లేదు. అవి వచ్చినట్లే వెళ్ళినవి. పన్నెండు సంవత్సరముల క్రితము, తోడి దేశస్థులగు స్త్రీపురుషు లనేకులవలెనే నేనును కారాగార యాత్రలు చేయ మొదలిడినప్పుడు, నేను చదివిన గ్రంథములనుండి ముఖ్యాంశములు వ్రాసి పెట్టుకొనుట ఆలవాటుచేసితిని. నా నోటుపుస్తకముల సంఖ్య నానాటికి పెరుగజొచ్చెను. నే నీ జాబులు వ్రాయ మొదలిడినప్పుడవి నాకు ఉపయోగించినవి. ఇతర గ్రంథములును నాకు ఎక్కువగా సహాయము చేసినవి. వానిలో తప్పనిసరిగా చెప్పుకోదగ్గది హెచ్. జి. వెల్సువ్రాసిన "చరిత్రసంగ్రహము". కాని సలహాకు మంచి గ్రంథములు లేకుండుట ఇబ్బందిగానే ఉండెను. ఇందువల్లనే కొన్ని విషయములు దాటి చేయవలసి వచ్చెను. కొన్ని కాలములు దాటివేయవలసివచ్చెను.

ఈ జాబులు మాఅమ్మాయి చచువుకొనుట కుద్దేశింపబడినవి. మా అమ్మాయి చదువుటకుమాత్రమే ఉద్దేశింపబడిన ఆంతరంగికవిషయము లిందు కలవు. వాటి నేమి చేయవలేనో నాకు తోచుటలేదు. తొలగించుట సులభముకాదు. కాబట్టి వాటిని ముట్టుకొనకుండ ఉంచివేసితిని. చేయుటకు చేతినిండ పని లేనప్పుడు మనమంతర్ముఖులమగుదుము. మనస్సు వివిధ స్థితులలో తిరుగాడుచుండును. మారుచున్న వివిధమనస్థితు లీజాబులలో స్పష్టముగా కానవచ్చుచుండునని నా యూహ. చరిత్రకారులు విషయపరముగ చరిత్రను వ్రాయుదురు. నేనట్లు చేయలేకపోతిని. నేను చరిత్రకారుడ నని చెప్పుకొనుటలేదు. ఇందు చిన్నపిల్లలకు పనికివచ్చు సులభ విషయములును, అప్పుడప్పుడు పెద్దల అభిప్రాయముల చర్చలును అసహజముగా కలిసియున్నవి. పునరుక్తు లనేకమున్నవి. నిజమునకు ఈ జాబులందలి దోషముల కంతము లేదు. ఇది లోతుకుపోకుండ