పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము

ఈ జాబులు ఎప్పుడు, ఎక్కడ ప్రకటింపబడునో, అసలు ప్రకటింపబడునో లేదో చెప్పజాలను. నేటి ఇండియాలో పరిస్థితులు వింతగా ఉన్నవి. భావిని సూచించుట కష్టము. రేపు ఏమి జరుగునో తెలియదు కాబట్టి సావకాశ మున్నప్పుడే ఈ పంక్తులు వ్రాయుచున్నాను.

చరిత్రాత్మకమగు ఈ లేఖావళి వ్రాసినందుకు క్షమాపణ, సంజాయిషి చెప్పుకొనవలసియున్నది, శ్రమ తీసికొని ఈ లేఖలు చదువువారికి అందు బహుశా క్షమాపణయు, సంజాయిషీయును గోచరించును. ముఖ్యముగా చదువరులు తుట్టతుది జాబు[1]ను చదువుదురుగాక, ఈ తలక్రిందుల ప్రపంచములో చివర నుండి మొదలు పెట్టుటకూడ మంచిదే.

ఈ జాబులు పెరిగినవి. ఈ పద్ధతిప్రకారము వ్రాయవలె నని నిర్ణయము చేసికొని వ్రాసినవి కా వీ జాజులు. ఈ జాబు లింతగ్రంథ మగుసని నే ననుకోలేదు. సుమారు ఆరుసంవత్సరములక్రితము, మా అమ్మాయికి పదిసంవత్సరముల వయస్సు వచ్చినప్పుడు, ప్రపంచము యొక్క తొలిదశనుగూర్చి సులభముగా, సంగ్రహముగా కొన్ని జాబులు వ్రాసియుంటిని. ఈ తొలిజాబులు పిమ్మట గ్రంథరూపమును ధరించెను. ప్రజ లాగ్రంథము నాదరించిరి. ఇట్టి జాబుల నింకను వ్రాయవలెనని అనుకొనుచుంటిని. రాజకీయములలో నిరంతరము మునిగితేలు నా కట్టి సావకాశము చిక్కలేదు. చెరసాల నా కట్టి సావకాశము నిచ్చినది. అట్టి సావకాశమును నేను వినియోగించుకొంటిని.

చెరలో జీవనము గడపుటవలన లాభములు లేకపోలేదు. విశ్రాంతి, కొంతవరకు నిస్సంగత్వము చేకూరును. ఇబ్బందులు అందరికిని తెలిసినవే. పుస్తకభాండాగారము లుండవు. మనము సలహాకోరు నిఘంటువులవంటి

  1. 196 వ జాబు.