పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
108
ప్రపంచ చరిత్ర
 


ప్రయాణముమాత్రము విపత్కరమైపరిణమించెను. తిండిలేక, నీళ్లులేక సైనికు లల్లాడిపోయిరి. వెంటనే కొద్దికాలములో క్రీ. పూ. 323 సంవత్సరమున అలెగ్జాండరు బాబిలన్‌వద్ద దేహము చాలించెను. పర్షియా దండయాత్రకు బయలుదేరినపిమ్మట తన మాతృదేశమగు మాసిడోనియా మరల సందర్శించలేదు.

ముప్పదిమూడవయేట అలెగ్జాండ రావిధముగ మృతినొందెను. తన కొద్ది జీవితములో ఈ 'మహా'పురుషు డేమిచేసినట్లు? కొన్ని యుద్ధములందు అతడు చక్కని విజయములను సాధించెను. అతడు సేనానాయకు డనుటకు సందేహములేదు. కాని అతడు గర్వి. దురహంకార పూరితుడు. ఒక్కొక్కప్పుడు క్రూరముగా, దౌర్జన్యముతో ప్రవర్తించెను. దైవసముడుగా తన్ను అత డెంచుకొనెను. కోపావేశము కలిగినప్పుడు అతడు తన ప్రియమిత్రులను పెక్కండ్రను చంపెను. నగరములను, నగరవాసులతోకూడ నాశనముచేసెను. అతడు నిర్మించిన సామ్రాజ్యములో చెప్పుకోదగిన దేదియు అతడు పోయిన వెనుక నిలిచి యుండలేదు. సరియైన రోడ్లుసైతము వేయించలేదు. ఆకాశమునుండి జారు ఉల్కవలె అతడు వచ్చెను. అతడు వెళ్లెను. అతడు మిగిల్చిన దేదియులేదు. స్మృతిమాత్రము మిగిలెను. అతని మరణానంతరము అతని కుటుంబీకులు ఒకరినొకరు చంపుకొనిరి. అతని మహా సామ్రాజ్యము శకలములై క్షీణించెను. అతనిని ప్రపంచవిజేత యందురు. తనకు జయించుటకు ఇక దేశములు లేవేయని అత డొకమారు కూర్చుండి విలపించెనట! కాని వాయవ్యదిశ యందలి చిన్నభాగమును మినహాయించినచో ఇండియా నాతడు జయించలేదు. అకాలమున సైతము చీనా గొప్ప రాజ్యము. అలెగ్జాండరు చీనాదిక్కునకైనను పోలేదు.

అతడు మరణించినతోడనే అతని సేనానులు అతని సామ్రాజ్యమును పంచుకొన్నారు. ఈజిప్టు టోలేమీ వశమైనది. అత డక్కడ శక్తివంతమగు దొరతనము నేర్పాటుచేసి పరంపరగా రాజవంశమువా