పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

ప్రపంచ చరిత్ర

అప్పుడు పర్షియారాజుపాలనలో నున్న ఈజిప్టు సులభముగా అలెగ్జాండరు వశమయ్యెను. జరక్ససు తరువాత రాజైన డరయస్ III ను అప్పటకే అలెగ్జాండ రోడించెను. తరువాత ఇంకొకమారు అతడు మరల పర్షియాకు పోయి డరయస్‌ను, రెండవమా రోడించెను. "రాజాధిరాజు" అగు డరయసు కాపురముండు దివ్యమగు రాజభవనమును అలెగ్జాండరు నాశనముచేసెను. జరక్ససు ఏథెన్సును తగులబెట్టినందుకు కసితీర్చుకొనుటకై అట్లు చేసితి నని అలెగ్జాండరు చెప్పెను.

వేయిసంవత్సరముల క్రితము ఫిర్దౌసీ అను కవి పరిషియన్ భాషలో రచియించిన ప్రాచీనగ్రంథ మొకటి గలదు. ఆ గ్రంథము పేరు "షానామా" పర్షియారాజులచరిత్ర లందుండును. డరయస్, అలెగ్జాండరుల మధ్య జరిగిన యుద్ధముల నీ గ్రంథము ఊహాకల్పనలతో వర్ణించెను. ఓడిపోవుటతోడనే డరయస్ ఇండియాసహాయము కోరినట్లు అందు చెప్పబడినది. "వాయువేగముతో నత డోక లొట్టియను" ఇండియా వాయవ్యదిశలో రాజుగానున్న పూర్ (పోరసు) కడకు పంపెను. కాని పోరసు అతని కెట్టి సహాయమును చేయలేకపోయెను. త్వరలోనే అతడు కూడ అలెగ్జాండరుదాడి ఎదుర్కోవలసివచ్చెను. ఫిర్దౌసీ వ్రాసిన "షానామా" అను గ్రంథములో అనేక స్థలములందు ఇండియాలో తయారైన కత్తులు, బాకులు పరిషియాదేశపు రాజులు, ప్రభువులు వాడుచున్నట్లు వ్రాయబడినది. ఆవ్రాతలు చదువుటకు సరదాగా ఉన్నది. అలెగ్జాండరు కాలములో సైతము ఇండియాలో మంచి ఉక్కుతో కత్తులు తయారు చేయుచుండిరని దీనినిబట్టిమనము తెలిసికొనవచ్చును. పరదేశములలోని ప్రజలు వాటిని ఆప్యాయముగా వాడుచుండిరి.

పర్షియానుండి అలెగ్జాండరు తన పర్యటనము సాగించెను. నేడు హీరటు, కాబూలు, సమరఖండము ఉండుదేశముగుండా అతడు ప్రయాణమైవెళ్లి సింధునదియొక్క ఎగువలోయలను చేరుకొనెను. ఇక్కడ మొట్టమొదటి హిందూదేశరాజును అతడు కలిసికొనెను. అతడు అలె