పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాఁడు జని శివునికనె నావార్త పూర్తి
ప్రాఁకె నయ్యది దిక్కులపైన బాగ.


తే.

భూసురాభిఖ్య కిదియెపో మొదటికార
ణంబు శ్రీరామ! యెవరు నిక్కంబుగాను
దీనిఁ జదువుదురో వా రనూన మైన
సంపదలతోడ నుందురు సర్వవిధుల.


క.

ఈకథఁ జదివినవారును
జేకొని యర్థంబుఁ జెప్పఁ జెల్లినవారున్
ప్రాకటముగ వినువారలు
శ్రీకరు లై యుందు రమితశేముషితోడన్.


తే.

పాండురంగవిజయంబు బలికి వీర
జనమనోరంజనముఁ జేసి జగతి కాది
కారణం బైన వేఱొక కథ రచించి
శష్పవిజయంబు జెప్పితి సత్య మనుచు.


ఆ.

ఏడుమారు లెవ్వఁ డీకథ చదువడొఁ
కుంభకర్ణుమొడ్డ కుడిచి నట్లె!
రామలింగసుకవిరాయఁ డిట్టుల వల్కెఁ
గాన దప్పవశమె కలియుగమున!

గద్య
ఇది యాదిపురాణాదిసద్గ్రంథకార కృష్ణరాయదత్తతెనాల్యగ్రహార
తెనాలివంశపవిత్రార్యజనస్తోత్ర మల్లిఖార్జునతనూభవ
రామలింగప్రణీతం బగు శష్పవిజయం
బనుమహాప్రబంధంబునందు
సర్వంబు నేకాశ్వాసము
సంపూర్ణము