పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

‘మౌనిచంద్రమ యే మని మన వొనర్తు
శంకరుఁడు మొన్న లింగ మై స్వర్గభూమి
చూడవచ్చెను పూజించి వానిఁ బంప
గలిగినారము మా పూర్వఫలమువలన.’


తే.

పాకశాసనుఁ డీరీతి బలుకుసరికి
పక్కునను నవ్వి ‘యెంతటి పాపకృత్య
మాచరించిరి! యది రావణానుజుఁ డగు
కుంభకర్ణునిమేఢ్రంపుగుండు సుమ్ము.


తే.

రామస్వప్నంబునను రాగ రాక్షసాధ
మునకు మేఢ్రంబు లేచి యీ పురము ముట్టె
దాని శంకరుఁ డంచును దలఁచి మీకు
గురుఁడు వలికెను వైదికితెఱఁగుఁ దోఁచ.


తే.

అట్టిమేఢ్రంబు వ్రాలుచున్నట్టితఱిని
మీర లెల్లరు స్వర్గంబుఁ జేరుకొనిరి
కొంద ఱలదాని నుండి యా కువలయమున
కరుగుఁ దెంచిరి నేఁ గంటి నచట వారి.


క.

సురు లయ్యును మేఢ్రముచేఁ
బరతెంచిరి భూమి కనుచు భావించుచు భూ
సురు లని పే రిడి వారల
నరవరులకు నప్పఁజెప్పినాఁడ మహేంద్రా!’


తే.

అనిన విని సిగ్గు నంది దేవాధినాథుఁ
‘డయ్య, తాపసచంద్ర! మీ రమలతతులు
పరులతో దీని దెలుపఁగా వలవ’ దనుచు
సాగి మ్రొక్కెను సిగ్గుచో వేగ వచ్చి.


తే.

వేగ నారదుఁ డేగి శ్రీవిష్ణుతోడ
బలుక నాతఁడు ధాతతో బలికె నంత