పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఈఁకెలం జిక్కి పైకి రాలేక వనిని
డాఁగియున్నట్టి మేఁకలప్రోగుగాను
మెదలుచుండఁగ నింతలో గదలె కుంభ
కర్ణుఁ డారవమాసాంతకాలమునను.


తే.

నిద్ర మేల్కని క్షౌరికుని తనదఱికిఁ
బిల్చి యాతనిచే తల ముందు బోడి
గాను జేయించుకొని మొలక్షౌర మంత
వానిచేతను జేయించి వరలుతఱిని.


తే.

మంగలాతఁడు నారాచమందిరమున
శష్పముల నెల్ల ప్రోగుగా చక్కబరచి
వారినిధిలోన నాప్రోగుఁ బారవైచె
తేలి యేతెంచె దరిగల దేశమునకు.


తే.

అందులో చిక్కువడిపోయి నట్టిసురులు
సాగరప్రాంతమున నుండి సాగి రాగ
‘హరిహరీ’ యంచు నారదుఁ డల్లవారి
సురులుగా బోల్చి వీరు వసుధకు నెటుల
దిగిరొ యని యెంచి ‘మీరలు దేనిచేత
వచ్చినా’ రన్న వారలు పలుక నిజము.


తే.

కుంభకర్ణునిమేఢ్రంపుగుండువలన
భూమికిం దిగు సురు లౌట భూసురు లని
పేరుబెట్టుచు ‘రాజుల జేరి మీరు
బ్రదుకుఁ’ డంచును వారలపరము జేసె.


క.

ఇటు వారి జేసి నారదుఁ
డటనుండి మహేంద్రపురికి నరిగిన నతఁ డీ
పటుతాడనునకు మ్రొక్కిన
యట నాతం డనియె ‘క్షేమమా మాహేంద్రా!’