పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

‘ఏడ కేగెద నన్న నీ విప్పు డిటుల
కడు విచారంబు నొందెడు కారణంబు
దెలుపు మొకయింత యింతలోపలనె వత్తు’
నంచు లేపుచు నుండె నా యతివ నతఁడు.


తే.

పిలువఁగాఁ బిలువఁగా నది తెలివి వచ్చి
కనులు విప్పక, నేను నిన్ గందు నంచు
‘తారకానాథ!’ యంచును తార పిలువ
వచ్చి నిలఁబడ కన్విచ్చి వానిఁ గనియె.


తే.

పాప మా తాత వేఱుగా భావ మందుఁ
దలఁచు నంచును ‘తిండిపై వలపు నీకు
పుట్టదా చంద్ర బొత్తిగా భోజనమ్ము
మాను చుంటి వ దేమి కర్మమ్మొ కాని.


క.

నీకును నాకు విచారము
చేకూరు నటంచు నతఁడు చింతించకపోఁ
డా? కొంచెము చింతించిన
పాకారికి మనలపై కృపాఁ? ఱేరాజా?’


క.

అని విభునితోడ నను తా
రను గని గురుఁ డనియె ‘కాంత! రయమున నే వ
త్తును గాన కోప మింతయుఁ
గొనవల’ దని చెప్పి వెన్కకన్ దిరిగె నటన్.


తే.

వానియాకారమును జూచి వారు నవ్వు
కొనుచు నుండంగ నెఱుఁగఁ డా గోలతాత
వజ్రధరుసేవకులతోడ వాఁడు వోయె
తారకారాజు తారల తనివి దీఱ.


క.

తలకు నొకవస్త్ర మాపై
మొల నొకపొడికాయ ఫాలమున బూడిదెయున్