పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


‘అచట గా దిచ్చ టచటగా దిచట’ ననుచు
మెల్లమెల్లనఁ దనచీరె నెల్ల విప్పె.


తే.

‘ఇదిగొ కంఠంబుపై బ్రాఁకె వెదకు’ మనుచు
వస్త్రహీనంబుగా వానివైపు దిరిగె
పాప మాతండు కంఠంబుపైని చీమ
వెదకుచుండెను, వెదుక నా విద్రుమోష్ఠి.


తే.

బంగరపుబొంగరాలను భంగపడఁగఁ
ద్రొక్కగలయట్టి యా చనుదోయి, వాని
ఱొమ్మునం జేర్చి ‘యదిగొ కంఠమ్ము దాఁటి
మధ్య కరుదెంచె చూడు చీ’ మనుచుఁ ‘దాఁకి
ఱాచు’ మని చూపె చన్ను తారావధూటి.


తే.

వస్త్రహీనంబు లై యున్న వనితచనులు
కన్నులారంగ వీక్షించి ‘కాని చీమ
ప్రాకె నిదె’ యంచు చన్నుల బట్టి యెత్తి
పానుపున నుంచి చంద్రుఁడు బలుకరించె.


తే.

పానుపునఁ బెట్టి చన్నులఁ బట్టి మోవి
పలువిధమ్ముల నాని యా కలికి తమ్మ
లమ్ము నోటను గరచి వే నెమ్మి మీఱ
రతికిఁ దార్కొనె శశి యనురాగమునను.


క.

పట్టినచన్నులఁ బట్టుక
పెట్టిన యాపెట్టు మగుడి విడువక దానిన్
దిట్టముగా రమియించెను
నెట్టిన తమకంబుతోడ నియతి దలిర్పన్.


తే.

అంత నా తార వానిని పంత మూని
క్రిందికిం ద్రోసి పై కెక్కి పొందుచెందఁ