పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అకలంకమైన మా యౌవనంబంతయు సుందరాకారుడై చూఱగొనియె
పతిసుతాదుల వీడి భావంబు తనయందె సమ్మదంబున చేర్చి నమ్మియున్న
మము విడనాడి తా మధురాపురికి బోయె నింత నిర్దయు డుర్వి నెందుగలడు
దానింక రాకున్న దడువుగా నిచ్చోట నొడల బ్రాణము దాల్చి యుండలేము


గీ.

స్త్రీహననపాతకం బది చెందకుండ శీఘ్రమున వచ్చి మమ్ము రక్షింపుమనుచు
హరికి జెప్పుమటంచు వా రన్నమాట మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

అని యిట్లు పల్లవాంగనలు బల్కిన నిష్టురోక్తు లాకర్ణించి యుద్ధవుండు
గ్రమ్మఱ మధురాపురమ్మున కటుబోయి శ్రీహరి కెఱిగింప జిత్తగించి
ద్వారకాపురి కేగి వరుస రుక్మిణాదిసతుల వివాహమై సంభ్రమమున
జైత్యప్రముఖదుష్టసంహార మొనరించి భూభార మణగించి బొలుపుమించి
గణపతి పూజన కాలమునందు గ్రమ్మర రాధికను గోపభామినులను
గలసి వ్రేపల్లెకు గడువేడ్క జనుదెంచి వారలగూడి దుర్వారభంగి


గీ.

పావనంబున రమ్యబృందావనమున నింపుమీర గ్రీడించి సుఖింపుచుండె
నట్టి కృష్ణుని లీలావిహారమహిమ లెద దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

రతిరహస్యానంగరంగకొక్కోకాది సముదగ్రసత్కళాశాస్త్రములను
జెప్పినట్టి విదగ్ధు లప్పటిజాతులవిధమును సత్వాదిభేదములను
గాంచి స్థానస్పర్శఘనమణిమంత్రౌషధులచే నరులకు దరుణులకును
గలరహస్యంబులు దెలిపిరి యనియొ నిక్కాలంబునకు సరి గాక యున్న
బరగ నిప్పటి కిల బహుజనానుభవసిద్ధామేయవివిధోచితాంశములను


గీ.

నీశతకమందు మరుగుగా నింపు మెరయ దెలియజెప్పితి నీజాడ తెలిసి చతురు
లంచికముగ క్రీడాసౌఖ్య మగుభవింపు డార్యులార బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పదియారుకళలును బహురహస్యము లిందు పొసగఁ గూఢంబుగా పొందుపరచి
నరలేనిచోటుల జిరకాల మభ్యాస మొనరింప నొకకొన్ని యుత్సుకమున
యున్నవి చక్కగ నుపలబ్ధి గలవారు యోచించి వేసట నొంద కెలమి
గనవచ్చు త్వరలోన ననుభవంబున కట్లు రాకున్న వినమాత్రమున భావ
బోధంబు గౌతున్న బొసఁగ విదగ్ధుండు గాకున్న నిజములు గా వటంచు