పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

తొయ్యలి యుయ్యెలశయ్య నడ్డంబుగా బవళించియుండ నప్పడతి నంచు
నకుఁ దీసి నేక్రింద ననువుగా నిలుచుండి వెస దాని పదము లెత్తి సరిజేసి
జొనిపి నాచేతుల స్తనములబట్టుక నుయ్యెల నూచుచు నొగినిలిచిన
చోనుండి యెడముజేసుకొని యూపూపున కీఁటెపోటులరీతు లెసగ జూపి
వింతలు గావించి యంతమీదట నిల్పియటు మ్రొగ్గిలో గ్రుమ్మ నతనుసిడము


గీ.

ఱాపుచే దానికళయు గలంకబారబరగ నాకౌను జేతులఁ బట్టి రుద్దు
కొని కళవిడిచినట్టి యావనిత మోహ మెద దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

లేమనొక్కెతను మాలిమి సేయుటకు దానిచంకబిడ్డను నేను సరస నెత్తు
కొను నెపంబున గురుకుచము చే దాకించి బిడ్డనుగొన ముద్దు బెట్టుగొనుచు
పతక మెక్కడిదని బల్కి చేనంటుచు నీ మేను చిక్కినదేమి యనుచు
చెక్కులు చేతులు చక్కగా నివురుచు మచ్చెకంటి జ్వరంబు వచ్చినట్లు
తోఁచుచున్నది యని తోడ్తొన చేసాడిఁ బదపడి గుండెలు బట్టిచూచి
జ్వరముగాదిది మేహసంబంధమగు కాక వెస మేహశాంతి గావింతుననుచు
బాలకుం డేడ్చిన బాలివ్వమని యిచ్చి మొనశి గ్రమ్మఱ వాని ముద్దులాడి
మేనితాకులచేత మెయి చెమర్చియు మఱి పులకలెత్తిన నేను గలయఁజూచి


గీ.

భయమెడలి దానిచేయిగీఱ బాళిమీఱ నన్నెలంతయు సైగచే నన్నుబిలచి
కూడిక్రీడించి సుఖముగైకొన్నవిధము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకనాడు శయ్యపై యోచనగా నేను పవళించి యుండంగ బడతివచ్చి
యొకవంక శయనింప నొగి ముద్దులిడబోవ మనసులోచేరిన మగువ కొరకు
మనివిదలించి మౌర్ఖ్యము వీడకుండిన బదరిన పనిపొందు పడదటంచు
బులుకలుజూచి యిప్పుడె తనంతనె గూడుననుచు నే నూరకుండిన గఱంగి
నేఁడుకొన్నప్పుడునే మోడెలు చేసితి [1]నని యది మది నుపాయంబు వెదకి
కలలోన విద్రచే నులికుల్కిపడి మళ్ళి పెనుదయ్య మొకటి వచ్చెనని యింతి
కలవరించుచువేగ గౌగిట బిగియంగబట్టిన నే జూచి పడతి! నీకు
బట్టిన దయ్యంబు వదలింతుననిబన్కి గరిమ నట్లనగూడి కళ శ్రవించిన

  1. నని యుపాయము మది నరసి రేయి