పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గలకపాఱగ చేయు కాంక్షతో పైకెక్కి కళలువీడఁగ జేయ గారవించి
వనిత నీకేమి కావలెనని దానికీదలచిన సొమ్ము లింపలర నాకు


గీ.

దయనొసఁగుమన్న నేమాట తప్పలేక దానికన్యభూషణము లీదలచి సొమ్ము
లొసగ మెయిదాల్చి వెలసిన యువతి ముదము మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

నవరాత్రి వ్రతముండి నలువొప్ప దశమినా డెప్పుడెప్పు డటంచు నింతిగూడి
రమియింప నాకు నిల్వక తీవ్రపతనంబుగా గని యిక లెమ్ము జాగువలవ
దటుపంమనకుబోద మనిచెయిబట్టి యయ్యుతి దోడ్కొనిపోయి యొకరికొకరు
క్షాళనం బొనరింప గడుకాంక్ష కలదన్నట్లు గావింప నా కంతలోన
కాయజధ్వజము ఛడాయింపగా నిల్వజాలక రయమున శయ్యచేరి


గీ.

యిర్వురము బంధంబు లేర్పడంగ రోషమున గూడుకొని బల్ తమాషగాను
సమత గ్రీడించి తనిసిన చంద మెల్ల మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

మఱియొక్కనాఁడు నే పెఱలేమతో గూడి రాకున్న, నతవికి నాకు ఋణము
సరిపోయె నని పండ్లు కొరుకుచు నేమేమొ తలపోయచుండంగ దానికడకు
యిదికాదు పని యని యే మఱుంగునఁ బొంచిపోయ తటూలున టొలతిమీద
బడి కౌగిట గదించి పాలిండ్లు బిగబట్టి నొప్పి పుట్టగజేయ నొప్పుకొనక
తిట్టుచుఁ దన్నుచుఁ గొట్టుచు నేడ్చుచు 'విడువిడు' మనిన నే విడువ నొప్పు
కొని యొట్టు బెట్టుకొన్నను వేగవిడిచి నీ యంఘ్రిసేవ యొనర్తు, ననిన నొప్పి


గీ.

కింతి యోర్వక, శఠుడ! నీ కెగ్గుగలదెః?యేమిసేయుదు నింక నీయిష్ట, మనిన
నాతితో నేనుగూడిన నాటిసొగసు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఒకయిందుముఖియు నే నొకనాటి దినమున వలువలు వెలిబుచ్చి బాహ్యరతుల
మిక్కిలిపొగరెక్కి పెక్కుభంగుల గూడుచును గతాగతములఁ జూచి నగుచు
సరికొల్తలేయుచు సరసమాడుచు చుంబనములు సేయుచు సుఖ మమర మఱల
గలయగూడుచు జయ కాంక్షలు దెలుపుచునొగి పందెములు వైచుచుండ నప్పు


గీ.

డటు కళలు రేగ వెన్కముందౌనొ యనుచు గడగి మనసొక్కదగచేసి కళలు విడిచి
యలసి యటునిటు బవళించినట్టిసొగసు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.