పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీసొమ్ము నేనది నిజమంచు కరువడి వడిగసేయుము నిల్ప వలదటంచు
నీకళ జాఱఁగనీకుము వెన్కముం దైన నిన్ జంపెద ననుకు మిగుల


గీ.

గడగడ వడంకుచును దాను గళను విడచి యెన్నిజన్మంబులకునైన నీవె నాకు
బతివి కావలె నన్న యప్పడతిమాట మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

రమణతో నధికస్రబ్ధ నవోఢను గలసి క్రీడింప నచ్చెలికి కామ
గేహంబునందు గిల్గింతలు దోచినది యేమొ నాదేహ మిపు డిదొక్క
తీరుగానున్నది తెలియరాదనిన నేనిలిపిన నాతోడు వలదనుచు
కట్టి బట్టి యధిక ఎగంబుగ నూచి నాప్రాణమప్పుడునిల్వ దనుచు కన్ను
గవమోడ్చి పాన్చునఁ గదలక మెదలక మాటలాడగలేక మాటిమాటి
కూర్పులు బుచ్చుచు నొడలెరుంగక కళను విడువననునస్కభావమునను


గీ.

దవిలి బాహ్యప్రపంచమంతయును మఱచి యవిరతంబును బ్రహ్మకర్మామభవము
సేయు యోగితెరంగున జెలగుదాని మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

రాజాస్య నేబాహ్యరతి సేయ చెయిబట్టి తనకుచకర్కశత్వంబు జూపి
మొనలచిక్కులు జూపి పొసఁగవచ్చో నెల్లద్రవముష్టముండుటంతయును జూపి
నెలకుమూడహములు నెఱిఁగూడకుండఁగ బ్రతిబంధ మిదె వెంటబడునుగాన
నందాక రతికాంక్ష జెందకుండగ జేయుమన వెసనలు జాము లట్లు నిలిపి
మార్చుకకూడుచు మఱియోసరిల్లుచు నెడనెడ సంక్రీడ నుడిగి మధుర


గీ.

పాఠము ల్మెక్కి పాల్ద్రావి బాళి మరలగలసి గ్రీడించి కళలు విడిచి
సొమ్మసిల్లినట్టి యానాటిసోయగమ్ము మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

ఒకదాని పరిమాణ మూహించకేగూడ నుచ్ఛరతం బయిన నోర్వలేక
కాళ్ళ ద్రోయుచు పొత్తికడు పిరుచేతులనాని పట్టుక సరియైనమటు
కటు బోవనిచ్చుచు నాక్రమంబున దన్ను జల్లచేయుమటంచు చాల వేడ
నిది బాగులేదు నేనిక ధేనుకాబంధమువ గూడ సరియగు ననుచు బల్కి
యటు గూడ సరికొల్తలై నొప్పిలేకున్న జూచి యచ్చెరెవొంది నుదతి తనిసి


గీ.

యౌర, నీవెంతనేర్పరి వైతివనుచు గరము మెచ్చుచు లేచి తాఁ గౌగలించి
నన్ను ముద్దాడి యనిచిన నాటిసుఖము మది దలంప బహ్మానంద మదియకాదె.