పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లంబోదరప్రహసనమ్

75

దీర్ఘ—మిత్రమా ! ఇదియేమి ?
జంబు —(స్వగతము) ఇంతపని జరుగక మాన దని దీర్ఘదంతు డిదివరకే జెప్పియున్నాడు.
కాస — గురువరా! గృధ్రీసంగమ మందే రసకందాయములో బట్టుబడితివా యేమి ?
వక్ర—
తే.

కుంజమున నేను గృధ్రియఁ గూరుచుండ
ఱేఁడు కనులారఁ జూచి యీ రీతిఁ జేసె
నైనపని కేమిగాని యొయ్యారిగృధ్రి
కెంతయో ప్రేమ నాపయి నింతవఱకు.

ఇంకను నా సంగతి వినుడు

చ.

జనములు నన్ను గ్రోఁతినిగ సల్పిన దానికి లజ్జ లేదు, భూ
పునికడ నుండి నాకు భయముం గన నన్యుని మేహనంబు నా
వనితభగంబు జొచ్చె నని భావనఁ జేయను పండితాళి న
న్ననయము దుష్టుఁ డంచు నిక నాడదొడంగుదు రంచుఁ బొక్కెదన్.

దీర్ఘదంతాదులు — ఒకరాత్రి గడచుటకేగాని ఱేపటి కిది పాతబడిపోదా! దీనికి విచార మేల?
వక్ర — అందువలన నీ చండాలపురాజు దేశమునుండి మఱియొకతోటకు బోవుదము. తరువాత,
తే.

ఏనగరి నేని యొక్కభూమీశుఁ గొలిచి
గొప్పశాస్త్రాలు వినుపించి మెప్పు వడసి
ధనమును గడించి గృధ్రికి ధార వోసి
మంచితనమున రావించి యుంచుకొందు.

అంతవఱకు నిపుణికను జంబుకుడు నేనును నేకముగా విషయించుచుందుము; తరువాత వానికి నే నడ్డము రాను. కడుపునిండ దినినవానిని నీవు తినవద్దనినం బ్రయోజనమే మున్నది? కాసరుని భార్య దీర్ఘదంతునకును, కాసరున కలాబూస్తనియు దక్కి గదా! రాజుగారి యెడబాటువలన వానరవేషమున పౌరుల నందఱును నవ్వించుకీర్తి నాకు దక్కినది.