పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఒకయెలనాగ యింటికి దూరమైయుండి యుబుసుబుచ్చుటకుఁ దా నొక్కనాడు
వచ్చి, దవ్వుల నుండి ముచ్చట లాడెదననిన నే బిలిపింప నణగి యణగి
వచ్చి, కొంగణచి యవ్వలనిల్చి సరసంబులాడుచు ముట్టంటు యంబరమున
కే కదా యదిదీసి క్రీడింపగారాదె యనిన నే నది బ్రహ్మహత్య యనిన
సిలిల ఫేనమునకు చవిటికి చెట్టుబంకకు [1]మాకు పాప మొక్కటియె గాదె
వాటి నంటకయుండ వశమె యేరికినైన నవనిలో స్త్రీహత్య కన్న బ్రహ్మ
హత్యాంశ మది యెక్కఁడగునె యాత్మకు మఱి పరికింప పాప మెప్పగిది గలుగు
ననుచు పైబడిరాగ నది చూచి పరువెత్త శుకవాణి తరిమి పట్టుకొని కూడి


గీ.

తనమనసు దీర్చుకొన్నయావెనుక నే వితాప మొనరించి చలువవస్త్రములు దాల్చ
చూచి పకపక నవ్విన సోయగంబు మది దలంప బ్రహ్మానంద మదియగాదె.


సీ.

పరసతి యొకనాడు వచ్చి నాకడ నుండ ననుమానపడి యింటివారు దారి
కాచియున్నారని కడువేగ నొగచేటి చెప్పిన నిక నెట్లు సేయుదనిన
నన్నేమి చేయుదు రెన్నాళ్ళనిండియో సారెకు మదినిటె కోరియుంటి
ననఁగనే నిటులేలననిన నీపైయాస ముక్కుటంబుగ మది నెక్కొనంగ
సమయంబు దొరకమీ చనుదెంచుటనులేక మగండు నన్నెప్పుడు దెగడువిడుచు
నోయని మొక్కుచునుంటి దేవుని కృపమాపక నింపించె నేని రొట్టె


గీ.

విరిగి నెన నేతిలో బడ్డ విధముకాదె యపుడు నీయొద్దనే యుండి యిచ్చకొలఁది
క్రీడ గావింతు ననుచుఁ బల్కిన పసందు మది దలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పరఁగ నేమెఱుఁగక భయభక్తి నుండిన మగనాలి వచింపఁ దగినదూతి
ననిచిన పనికొప్పుకొనినఁ దానిగైసేసి నీక్షించి వగలచే వెక్కి యేడ్చి
కొవ్విరుల్ సవరించి కుసుమభేదముల వాసన నీకు దెలుసునా యనుచు వడి
యోగిరం బిడి,యన్న మొకపదార్థముననే దినవచ్చునా చెప్పు మనుచు నడిగి
చెలి పండ్లు దిని యుమిసిన దానిలో చవియుండునా యని భావ మొనసి దెలిపి
పవనంబు మెసవి దుర్బలులైన ఋషులన్న నట్టిగాథల కేల వగపు, ధాత్రి
నఖిలవేదాంతంబులం దాత్మ గఘలేపనిరయ లేదనుమాట తరుణి వినవె

  1. మాకు సామ్య