పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వకవుల

చాటువులు

ఉ.

చేతికివచ్చువస్తు వెడజేసితి, వాప్తులు శత్రులైరి, యే
రీతినినైన గార్య మొనరించెద నన్న నొనర్ప నీవు, నీ
చేతికి సాగి నంత పని జేసితి వింతియె కాని, యింక నా
యా తొక టైన బీక గలవా? గ్రహచారము! దుర్విచారమా?


ఉ.

కూటమి నొక్కనాటికి త్రికోణసహస్రములన్ బెకల్చు నీ
ధాటికి ముజ్జగంబులును దట్టకమబ్బులు మంచుకొండలున్
సాటికి నిల్వగా గలవె, చాలు శ్రమంపుమి జృంభణంబు, నీ
వేటికి లేవ బూనితివి? యీ నడిజామున నో ప్రజాపతీ!


క.

ఆ కాంతామణి యుపరతి
కాకాశము వణకె దార లల్లల నాడెన్
జోశైదగిరులు కదలెను
భీకరముగ దమము చంద్రబింబం బంటెన్.


క.

సుదతీ! నీ కుచగిరు లిటు
కదశి వడిన్ గూలినట్టి కారణ మేమే
చెదరి గిరు లైన గూలవె
కదసి వడిన్ క్రింద ద్రవ్వగా! చెలువుండా!


క.

పట్టితి రెండుకుచంబులు
పెట్టితి మఱి తొడలసందు పెటపెట లాడన్
వట్టలు గంతులు వేయగ
గట్టిగ గొట్టితిని జుల్లి కందగ మిగులన్.