పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"నాయది నాకు; ముప్పదియు నాకుము; చెల్లిదియు నాకు”మన్న గ
న్దోయిని నెఱ్ఱచేసె వెలతొయ్యలిపై సరసుండు; “తల్లి ము
న్నీయిలు మాకు మువ్వురకు నిచ్చెను; నాదెయనంగ బోకు మో
నాయక! యంటి," నంచు వెలనాతి నిరుత్తరు జేసె నాతనిన్.


క.

“పనస తొననుండి తొలగిం
చిన దాననె చెలియ, నల్లచీమల నెల్లం?
"జనుదెంచు నేమొ మగుడగ
ననంటిపం డీవు పెట్ట నటవిటకాడా.”


చ.

తలక్రిందై తపమాచరించుచును గాంతారత్నమా, నాకడం
గల డత్యద్భుతరూపు; డాతని వివిక్తంబౌ స్థలిం బెట్టగా
వలయున్; నీకడనున్న కొండగుహ నీవా?”యంచు బుణ్యాంగనన్
దిలకించెన్ విటు; డామె “మౌని నడనెత్తిన్ నోరుదద్దా?యనెన్.

సరసచాటువులు - సంపూర్ణము.