పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


(పెంట్లాము- (Pentaloom) షరాయి: బట్టను- (Botton) గుండీ


చ.

దొరలటు నున్నగా సుళువు దోపగ, మీసము గడ్డమున్ మహా
త్వరగను షేవు చేసికొను భర్తల గన్గొని భార్య, “లక్కటా!
హరిదల మంచు; బూడిద యటంచును, మాకిక నేల? విూదురే
జరులను దెండి,” యందరు, హసన్ముఖు లౌ'చును వారు పొండనన్.


(షేవు (Shave) క్షనరము; రేజరు (Razcr) మంగలికత్తి)


చ.

క్షవరము కాంచెడున్ సివిలుసర్విసులోన బ్రవేశమైన వా
రి వదనముల్: భువిన్ మిలటరీ పని వారికి మీస లెప్పుడుం
దువిలియె యుండు సూనశరదారుణసంగర మందు నుండు న
ట్టివి గనుకన్ భంగములకు ఠీకుగ మీసము లుండు చెంపలన్.


(సివిలు సర్వసు) (Civil Service) యుద్ధసంబంధము కాని కొలువు: మిలటరీ - (Military) యుద్ధసంబంధమైన కొలువు,


శా.

చెల్వున్ షాపున బట్టకై చెలియ వాంఛింపన్, “సతి, పూర్వపున్
వల్వా కావులె?” నంచు భర్త తను సంప్రశ్నించె; నింగ్లీషునం
దెల్విం గల్గిన భార్య, “పూర్వపుది కాదేన్ గ్రొత్తదిన్ వచ్చునా?
మొల్వం బోలును మీకు పీనిసులు ఱేపున్ మాపు నందున్.


(షాపు (Shop) దుకాణము: వల్వా (Vulvca) యోని; పీనిసు (Penis) శిశ్నము: పూర్వపున్ వల్వకావలెన్ వెనుకటిరకపు బట్టయా కావలయునని భర్త యడిగెను; పూర్వపుయోని కావలయునని భక్తి యడిగినట్లు; ఇంగ్లీషు చదువుకొన్న భార్య యొకయర్ధముతీసి, యెకసక్కెము చేసినది.)


చ.

తవితను నేర్చుకొన్న గణికం గనుచున్ రసికుండు, “చెప్పు మొ
క్క విషయమున్ మొగంబును భగంబున గల్గిన దెద్ది? యన్న న
య్యువతి యెఱుంగదయ్యె; నత డుత్పలపద్యముఖాక్షరాళి నా
ల్గవదియు జేర్చినన్ భగము గాదె గణం?' బని పల్కె నవ్వుచున్.