పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నెలకున్ ముప్పది జీతముం గొనుచు నెంతేస్వేచ్ఛగా నున్న వే
శ్యల బియ్యాల, దదర్ధజీవితములం దా క్టింగులం జేసి శు
ష్కిలు బియ్యేల్ గని మ్రొక్కుకాల మరుదెంచెంగాదె? యాకారమే.
విలువం దెచ్చు నటంచు మాఱు డిపుడో బియ్యేలు? బియ్యాలుగా


(బియ్య (ఓఢ్రమున) - భగము, బియ్యే (B. A.); ఆక్టింగు (Acting) ఖాయము కానిది; అకారము - అయన్న యక్షరము, (రూపము)


ఉ.

లోహములం గడాని, యిహలోకపుగింజలలో బటాని, జి
హ్వాహితదాయకాఖిలపదార్ధచయంబున జీనియున్, జగ
న్మోహినులందు సాని, కవిపుంగవు లందు శతావధాని, స్త్రీ
దేహమునందు మోనియు బ్రతిష్ఠను గాంచెను వ్రేష్టతన్ భువిన్.


క.

జాకెట్టున గల వాచీ
పాకెట్టున జేయి పెట్టి, "పడతీ, వాచీ
లేకిట్టులు టిక్టిక్కులు
నీ కిట్టులు కలిగె?" నంచు నెయ్యుం డడిగెన్.


జాకెట్టు (Jacket) స్త్రీలుతొడుగుకొనుజుబ్బా; పాకెట్టు (Pocket) జేబు; వాచీ (Watch) జేబుగడియారము


ఉ.

స్త్రీలచనుల్ మింతబు లయి ప్రీతిని గొల్పును; బట్టరాని బొం
డా లయిన్ విలుల్ నిరసననం బొనరింతురు వానినిన్; టెనిస్
బాలును జేతబట్టుకొని బాలకు లాడుదు; రట్లు గాక ఫుట్
బాలును గాళ్ళదన్నగ గడంగుదు, రెందరు గల్గ నందఱున్.


బాలు (Ball) బంతి: టెనిస్ (Tennis) ఫుట్ (foot) కాలు


ఉ.

కాముడు కుట్టువాండ్ర చెలికాడె యగెన్ మగవారిబ్రేమతో
గోటాలు లారయన్, రవిక కుట్టు పుటు క్కనిపించు; నట్టు లే
భామల వంక బూరుషులు భ్రాంతిమెయింగను లెత్తిచూడ. బెం
డ్లామలకన్న బట్టనులు ట ప్పనిపించును జప్పుచప్పునన్.