పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యదుకుం బెట్టెనొ? పగిలిన
దది సీల బిగింపు లింక నవరర మయ్యెన్.


చ.

మొగములు మాసమందు నొకమూడుదినంబులు దక్క స్త్రీలకున్
మిగిలి యట్టి రోజులను మెచ్చొదవించును వీడ్యపున్జిగిన్;
భగములు మూడు రోజులనె పాపము! తద్విధ మైన వీడ్యపు
న్జిగిని ధరించుచుండు విధి చేసెను దాదృశపక్షపాతమున్.


ఉ.

ఏతఱి మన్మథుండు తనయింటిపయిన్ నునుతేంట్ల కాపుగా
రాతిరియుం బవల్ నిలిపె, రా గమకించు భుజంగతండమున్
'హా!' తను, 'హాతు హా!' తనును 'హా!' తను! నయ్యవిందుచేతన్
యాతులు గాగ మాఱినవి యాదిహకారము లోపమౌ గదా.


తే.

మారు డాత్మదండంబును బూరుషులప
రంబు గావించి, నిజమందిరము రమణుల
వశము చేయంగ, నయ్యది వచ్చి యిందు
జొచ్చు నలవాటు మాన్పుట సులభమగునె?


ఉ.

చిత్తమునందు సంభవము చెందిన మన్మథు డందు నిల్వగా
నొత్తెడు గల్గె గర్కశపయోధరభూధరకరణంబునం;
గ్రొత్తనివాస మేర్పఱుచుకొంటకు నూరుల కేగి యచ్చటన్
బెత్తెడుకొంప నుండియును, బిండు నతండు సమస్తవీర్యమున్!


తే.

ఊరుల నడుమ మన్మథు డుండ నిఁడ్లు
కట్టకొనె; దానిపై దొలుకారు శష్ప
తతి ప్రబలి ద్వారముల గప్ప దండములను
దొలగద్రోయుం డనుచు బురుషులను బంపు.


చ.

ఘనతరకార్యముల్ సలుపగల్గ బ్రయోజకు లైనవారికిన్
వెనుక సహాయు లుందురు కనీస మొకిర్వురెయేని; బ్రహ్మదే
వుని గతి సృష్టి సల్పుటకు బూనిన శిశ్నము వెన్కనండముల్
దనరుట గాదె యా పనిని దా నొనరింపగ నేర్చు జక్కగన్.