పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

సరసచాటువులు


రగసదృశుండు వీని రుధిరం బనినన్ విషమే; విషంబు దు
ర్భగ! మును నీవు పెట్టగను బానము చేసినవాడనే,' యనె౯


సమస్య.

దెంగన్సత్తువ చాల దంచు రమణిం దేర్చెన్ రతిక్రీడలన్


శా.

అంగంబుల్ విటుబొయ్యనం గ్రమముగా నంటంగ రోచేడె 'నా
భిం గేల్పెట్టెద? వేది యెందొ సరిగా వీక్షింప లేవే?' యనం
గం, గాంతుండు పకాలు మంచు నగుచుం గన్దోయి చత్వార మొం
దెం; గన్సత్తువచాల' దంచు రమణిం దేర్చెన్ రతిక్రీడలన్.


సమస్య.

రంభ త్రికోణమధ్యమున రత్నము భాసిలె నద్భతంబుగన్


ఉ.

జంభవిరోధి కోడిని ని?శాచరు లాతని పంపునన్
దంభము మాని రంభమరుధామమునం దల లుంచి మ్రొక్కుసం
రంభమునందు నూడి, యొకరత్నము లోపట జిక్కె; నందుచే
రంభ త్రికోణమధ్యమున రత్నము భాసిలె నద్భతంబుగన్


క.

ధనకాంక్షమ గల గణికా
కనకాంగులతోడ జిత్తకార్తి దిరుగు స్త్రీ
శునకాలను దక్కెడనో
తునికోలనొ తూచి సరిగ దూగగ వచ్చున్.


చ.

ఖగపతి తెచ్చుచున్నపుడు కాఱి సుధాలవమే పొగాకుగా
జగతిని బుట్ట వొందెనను సంగతి సత్య మటంచు దా మెఱుం
గ గలుగుచుంద్రుగాదె గణికామధురోష్ఠసుధారసంబు ద్రా
గగ గమకించు నట్టి విటకాని, డ్రట బుట్టుడి చుట్టవాసనన్.


ఉ.

విత్తులనుండి చెట్లు ప్రభవించుట యున్నది గాని పండ్లె యు
త్పత్తిని బొందు టబ్రము గదా? వనమాలిసుతుండ స్త్రీలకున్
హృత్తటమందు జిన్నపుడె రెం డిసుమమంతలు విత్తు లుంచగా,
గ్రొత్తవయస్సునాటి కవి రూ పగు గుత్తపుదబ్బపండ్లుగా.


క.

మదను డను స్వర్ణకారుడు
పదకము చెలి తొడలి నడుమ బాగుగ నిడి యే