పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరసచాటువులు

85


తే.

కను, ప్రియా, తులువయళి యీ యీకలువపూకు
ఱంగటం గని, యిందు మరంద మొడ్డ
గిల్లఁ నెం తొప్పె నం చుల్లసిల్లుచు, నది
గ్రోలి నిదుర పొందెం గులుకుచు నచటనె.


ఉ.

"ఇంతలు చన్ను లుండ మఱి యెవ్వరి గూడెదు భాసురాంగ? యే
కాంతమునందు నున్న జవరాల; ద్రనం బడి వెన్కతీయులా
గింతయ గాక, నీ వెఱుగవే మరు డిచ్చిన దారి చొప్పు? నీ
వింతభయంబు మై నుడుగ వెల్లిద మౌదువు; మాట లేటికిన్.


ఉ.

"నిక్కదు, దోప నేల? తరుణీకులరత్నమ, యింక నీపయిం
జిక్కె ఘనంబు నీకు; విను, చిత్తజుదండము జప్పరించెదో?
చొక్క బరాందిమద్యముల చూఱల బాటిలు వేడిచేత బెం
పెక్కదజేసి, దాని మరునింటను దూఱిచి యాదరించెదో?"


సమస్య.

చన్నులవంక జూపె జలజాస్య విటుండు తొలంగిపోవగన్.


ఉ.

"క్రొన్ననవిల్తుగేళి గవ గూడగ నియ్యెలతోటలోనికిన్
ని న్నిపు డేగుదె మ్మనుచు నే గబు రంపితి నింతి, నా చెలుల్
తిన్నగ నివ్వనంబున కదే! చనుదెంచుచు నున్నావా,” రటం
చన్నులవంక జూపె జలజాస్య విటుండు తొలంగి పోవగన్.


సమస్య.

యో నిరతంబు జేయు నరు డొందడు పాపము బొందు
బుణ్యమున్


ఉ.

॥ మానక 'రామ, రామ,' యని మానసమందు శివుండు నిత్యమున్
ధ్యానము జేయుచుండు; నల తారకనామము జిత్తమందు శ్ర
ద్ధానియమంబు లొప్పగను దాను బునశ్చరణంబు వందొ, వేయో
నిరతంబు జేయునరు డొందడు పాపము, బొందు పుణ్యమున్.


సమస్య.

'భగమును నీవు పెట్టగను - బానము చేసినవాడనే' యనెన్


చ.

దగ గొని దుస్ససేనుని యెదం గల నెత్తురు గ్రోలు భీము డం
తఁ గురుపతిం గనుంగొనుచు 'ద్రావెదనంటిని, ద్రావితిన్ మహో