పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రాసిన సంస్కృతాంధ్రకవులెల్లరు నిప్పటిమనకు బూతుగా దోచు నీమాత్రపుశృంగారమును వాడియేయున్నారు. విమర్శకులు గ్రంథపరిశోధన చాలకయో చదివినది మరచిమో కాళిదాసాదులగు సంస్కృతకపులు కవిత్రయమువారు పింగళి సూరన్న మొదలగు తెలుగువారు శృంగారరసము రసికాభిలాషములో నున్నదానికంటే దక్కువగా వ్రాసిరని చెప్పసాహసించిరి. ఆడుదానినోటిలో సయితము నీగుబ్బల నుబ్బించిన నీయౌనప్రాదుర్భావమునే నిందించుకొనుచున్నమాటలు బెట్టిన కాళిదాసుని శృంగారము వీరికి రుచించినది. పురాణకవులగు కవిత్రయము వారిమాట కేమి గాని ప్రభావతీప్రద్యుమ్నుల సమాగమము మొదలుకొని వారిరత్యాదులను విజృంభించి వర్ణించిన పింగళి సూరన్న శృంగారము వీరికి రుచించింది. స్త్రీవర్ణనము నఖశిఖపర్యంతము నొక్కయవయవమేని విడువకుండ చేసి రతివర్ణనము సయితము మానని తయిన శృంగారప్రబంధకవుల శృంగారమెల్ల వీరికి రుచించినది కానీ యేహెతువుచేతనో పాప మీరసికాభిలషము సంగతి శృంగాన మన్నమాత్రము వీరికివదల కంటగించినది. పేరు పెట్టుట ఎందులకు గాని నవీనులలో సంఘసంస్కర్తలైనవారు సహితము చేసిన శృంగారము రసికాభిలాషములోని దానికంటె దీసిపోటే! దానిని విమర్శకు లెంత యాదరింతురు? పూర్వోదాహృతకవులగ్రంథములు సర్వకళాశాలాధికారులు పరీక్షలకు గూడా నియమించుచున్నారే. విద్యార్థులు తలవంచుకొనియైన జదువనే చదువుచున్నారే. శృంగారభూయిష్టములని తలపక వైజయంతీవిలాస విజయవిలాస ముఖ ప్రబంధముల నాగరిక పత్రికాధిపతులును ముదింపించి ప్రచురించుచున్నారే. ఆవిషమవృక్షముల గూడ నీవిమర్శకు లేల యూడబెఱుకరు. శ్రీనాథునిదన్న హేతువుచేత రశికాభిలాషమును మూలనడగద్రొక్కక ప్రకటించుట యొకసాహసము కాదు కాని, యీవిమర్శకులకు తెలిసియు తెలియని విమర్శనము వ్రాయుట సాహసమే. వెనుక ముందు లాలోచింపక తొందరపడి వ్రాసిన యీవిమర్శనమును చూడగా నిట విమర్శనావేశముచేత నొడలెఱుంగక యున్న ధూర్తవిమర్శకుడెవ్వడో వ్రాసి యుండవచ్చునని తోచుచున్నది. కవిత్వసైలిం దెలుపుట కుదాహరింపవలసిన మృదువయిన పద్యములు రసికాభిలాషమున లేవట? కనక నెన్నియోసారులు చదివినను లాభింపకుండుట కిది నిదర్శనము. లాభించి యుండి యడల 1. 2. 8. 10. 17. 26. 32. 45. వ పద్యము లుదాహరించిన నష్టము లేదని తెలిసికొనకపోయియుండునా? అందు రెండు సైలి తెలుపుట కీదిగువ నుదాహరింపబడుచున్నవి.