పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జూచి వర్నించుటకైన నేమి, సింహాచలము వంటి పుణ్యసైలముమీద సంతతమును గూర్చుండిన మహానుభావుడు పరమభాగవతోత్తము డనవలసిందే. నీళ్ళరేవులకు వచ్చెడి మంగలి, చాకలి, తెలికల పడుచులను సయితము వలసిన నేమి, వారిచేత శ్రీకాళీకేశ్వరీచరణములపై నొట్టు వేయించుకొనిన ధన్యాత్ముఁడు నైష్టికు డనవలసినదే. “ఈతడు యౌవనదశయందు శృంగారనాయఁకుడై స్త్రీలోలుఁడై తిరిగె" నని యొకచోటను, "అవసానదశయం దిట్టికష్టముల కెల్లను గారణము యౌవనదశయందుఁ గామవశముచేత స్వేచ్ఛగా విహరించి దేహమును ధనమును బోఁగొట్టుకున్న పాపఫలము తక్క వేఱొక్కటి కానరా” దని మఱియొకచోటను గగపుచరిత్రయందు వ్రాసిన రావుబహద్దరు వీరేశలింగంపంతులువా రీవిమర్శకులపాటి యెఱుఁగరు కాఁబోలు! "విధివిరామము లేక వేశ్యకాంతలఁ నేరాధరసుధారసధారలఁ గ్రోలు"చుండినను గాళహస్తీశ్వరమహత్మ్యగ్రంథకర్తయగు ధూర్జటి మాత్రము పరమభాగవతోత్తముఁడును నైష్టికుఁడును గాఁడా? లేక, "ప్రమత్తునిం జారుఁ డనంగరాదు వెలుచం బరకాంతలఁ గూడినేనియు" నని విమర్శకుల యుద్దేశమా? శ్రీనాథుని జా ప్రసిద్ధి యబద్ధమైనదని విమర్శకు లేమైనఁ కారణములు చూపి పరమభాగవతోత్తముఁడును నైష్టికుడు ననిన బాగుగానుండును. రసికాభిలాషము వ్రాయుసరికి శ్రీనాథుఁడు శృంగారనాయకు డనుట స్పష్టము. శృంగారనాయకుడనని తెలియచేసికొనుటకే తని నామమును శ్లేషించుచు శృంగారశ్రీనాథపదము నుపయోగించియుండును. రసికాభిలాషము శ్రీనాథునిదని చెప్పుటవలని నాతనికీర్తి పాడగునేమో యని విమర్సకులు జడియ నవసరములేదు. వీథినాటక మాతనినిదని చెప్పుటవలనకంటే నిప్పు డెక్కువగా నాతనికీర్తి పాడు కాదు. రసికాభిలాషమున బూతు విస్తారముగా నున్నదని శ్రీనాథు డాగ్రంథము తనదని తెలియఁజేసికొనుటకు సిగ్గుపడెననుట యాలోచనలేని వ్రాత. ఈమాత్రపుశృంగారపద్యముల నతడు తక్కినగ్రంథములలో వ్రాసియేయున్నాడు. వీథినాటకములోనివని యప్పకవి యుదాహరించిన "కుసుమం బద్దిన చీరకొంగు", "కందుకకేళి సల్పెడు ప్రకారమునన్" మున్నగు పద్యములు బూతు లేనివా. అవి కమలనాభామాత్యపౌత్రుడు మారయామాత్యపుత్రుడు నగు మహాకవి శ్రీనాథుడు రచించినవేకదా! ఒక్కశ్రీనాథుడే యన్నమాట యేమి? "శృంగారుడు శ్రీనాథకవి" యని వ్రాసిన శతావధాని తిరుపతి వెంకటేశ్వరకవుల కీమాత్రము తెలిసినది కాదు కాబోలు. వయస్సు ముదిగి తరువాత గ్రంథములలో వ్రాసిన శ్రీగంగనీతులు వ్రుద్ధనారిపాతివ్రత్యమును సూచించునని యెరుగక వీ రిట్టివెర్రివ్రాతలు వ్రాసిరి. కాశీఖండ భీమఖండ గ్రంథకర్త యగుట మాత్రముచేతనే శ్రీనాథుడు సతతమును బరమభాగవతోత్తముడును నైష్టికుడు నయినచో, "భువనైకమోహనోద్ధతసుకుమారవారవనితాజనతాభువతాపహారి సంతతమధురాప్రబంధముల