పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నంతమాత్రమున నిది వంద్యముగాదు. నవీనులు రచించినచో నింద్యముగాదు. బూతు లెప్పుడు నాగరికదూష్యములే యగును. సెట్టి లక్ష్మీనరసింహముగారు తాము పీఠికలో వ్రాసిన యుక్తుల ప్రతిహతము లనుకొని శ్రీనాథుఁడే గ్రంథకర్త యని సిద్ధాంతముచేసి తెనాలిరామకృష్ణుడు, చేమకూర వెంకటకవి, కూచిమంచి తిమ్మకవి, ఆంధ్రకవితాపితామహుడు మొదలగు మహాకవులందరు నేబది పద్యములకంటె నెక్కువలేని యీబూతుల ప్రబంధములోనుండి కొన్ని కల్పనలు దొంగిలించినారని వ్రాయక సాహసించిరి. ఈగ్రంథము మూల నడగద్రొక్కక ప్రకటించిన సాహసమే తాము యీపాహసములు గూడ నే మనవలయునో తెలియకున్నయది. ఆమహాకవు లీగ్రంథమునుండి తొలగించినారనుటకంటే నవీనుఁ డెవ్వడో యీ గ్రంథము రచించి మంచి కల్పనలు తోపమి నీగ్రంథచౌర్యమును జేసి యుండునన్న బాగుండును. గ్రంథము ప్రాతఁదగుటచే గొన్నితావులయందు శిథిలము కాగా సెట్టి లక్ష్మీనరసింహముగా రక్కడక్కడ నాయాభాగములు తాను బూరించితిననియు శైలులంబట్టి భేదములు తెలియును గనుక నట్టి భాగములకు గుర్తులు వ్రాయలేదని పీఠికలో తెల్సియుండిరి. మాబుద్ధికిఁ జూడ గ్రంథమందంతట నొక్కశైలియే కనబడుచున్నది గాని వేర్వేరు శైలులు కనబడుట లేదు. కవిత్వశైలిం దెలుపుట కిం దుదాహరింపవలసిన మృదువయిన పద్యములు లేకుండుటచే మానితిమి.