పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనోరమ

ఆగష్టు నెల 1907

రాజమహేంద్రవరము

కృతివిమర్శనము

రసికాభిలాషము — ఇది యొక్కటే యాశ్వాసముగల చిన్నప్రబంధము. ఈపుస్తకము విశాఖట్టణనివాసులు రుక్మిణీకల్యాణనాటకగ్రంథకర్తలు పట్టపరీక్షయందు గృతార్ధులు నగు మ.రా.శ్రీ. సెట్టి లక్ష్మీనరసింహముగారి పీఠికతో విన్నకోట అప్పలనరసయ్య శ్రేష్టిగారి శారదామకుటముద్రాక్షరశాలలో ముద్రితమయి ప్రకటింపబడియె. ఆసెట్టి లక్ష్మీనరసింహముగారు కడచిన వేసంగి సెలవులలో బంధువులయింట వివాహము నిమిత్తము సింహాచలపుటడివారమునకు బోయి యుండగా నక్కడ నొకశ్రీవైష్ణువుని గృహములో నీపుస్తకము వారికి లభించినదట. ఈగ్రంథము శ్రీనాథుని వీథినాటకముతో గలసి యొక్క తాటియాకుల పుస్తకముమీద వ్రాయబడి యుండుట చేతను గ్రంథాంతమున చక్రబంధపద్యమునందు శృంగారశ్రీనాథ యను నామము గనంబడుట చేతను గవిత్వము కల్పనలు రసవంతముగ నుండుట చేతను గద్యము లేకపోయినను శృంగారనైషధము, కాశీఖండము, భీమఖండము, హరవిలాసము రచియించిన మహాకవి శ్రీనాథుడే దీనిని రచియించెనని యాలక్ష్మీనరసింహముగారు పీఠికలో సిద్ధాంతము చేసిరి. కాని యాసిద్ధాంతము మా కంత యుక్తియుక్తముగ గనబడలేదు.

మే మెన్నిసారులు వారి పీఠికను మూలగ్రంథమును శ్రద్ధతోఁ జదివినను శ్రీనాథుఁ డీగ్రంథమును రచియించియుండఁ డనియు విషయాసక్తుడయి పడుచుతనపు గర్వముచేత నొడ లెరుంగక తిరుగు ధూర్తవిటు డెవండో తనదుష్పాండిత్యము మెరయు నీపద్యముల నల్లియుండవచ్చుననియు మాకుం దోచుచున్నది. ఇట్లు మాకుం దోచుటకు కారణముల గొన్నింటి నీక్రింద నుదాహరించుచున్నారము. గ్రంథాంతమునందు గద్యముగాని గ్రంథారంభమునందు కవివంశాదులు కాని లేవుకదా? అందుచేత మన మూహలు చేసి కవిపేరు కనుగొనవలయు ననుట స్పష్టము. చివర చక్రబంధములో నేర్పడు శృంగార శ్రీనాథ పదములచేత శ్రీనాథుడే గ్రంథకర్తయని మన మూహింపదగదా? అ ట్లూహింప వీలులేదు. శ్రీనాథునకు శృంగారశ్రీనాథుడని యెక్కడను బ్రసిద్ధిలేదు. శృంగారమువారు శృంగారకవివారు తెనుగుదేశమందు వైష్ణవులలోను నద్వైతులలోను ననేకు లున్నారు. వారిలో నెవరయిన శ్రీనాథనామము గలవా డొక డుండవచ్చును. అతడే తనదురభిలాష బద్యరూపకముగా బయటికి వెల్లడించి