పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పైకొని పలుమాఱు బస్కీలు వేయుచు పఁరగ మత్కళ కల్క బాఱజేఁసి
ఖలనవేళను గ్రీడ నిలుపక గావించి తుది నందులోఁ జాల తొరయ జూప


గీ.

నిలిపి కళలను విడిచిన బలుసుఖంబుకన్న శతగుణిదానంద మనుభవించి
యబలను నుతించి యది మొద లటుల చేసి ముదముగంట బ్రహ్మానంద మదియకాదె.


సీ.

విను పూర్వసంకేతమున నేను సందుగోడలమఱుగున పొంచి దలగకుండ
నను సైగజేయ మెల్లన తల్పుచాటున నీవలావల నిల్చి యింటివార
లిసుమంత వినకుండ గుసగుసననుచు చేమార్పుల మేము మర్మములు దడువు
కొనుచుండ నంతలో తన భర్త వచ్చిన నుపచారములు చేసి యోగిరమిడి
కరగతకలశియై పెరటిలోనికిఁ పోయివచ్చెదనని చెప్పి వచ్చి నన్ను


గీ.

గలసి గోబంధమున క్రీడ సలిపి, మరల నను గలియు టెప్పుఁ డనుచు మేహనముచేత
బట్టి కదలించి సెలవిచ్చినట్టి నెనరు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

తలిరుప్రాయమువాడు వలపు నాపై జేర్చి మరిగి యర్ధంబుగా దిరుగులాడు
నుడిగంపుపనులు చేయుటకు దగ్గర జేరి మేనిసోకులఁ గొంత మెరపుజూపు
ప్రియలన్నమాటలు వినుమని చెవియొద్ద చేరి తాగుసగుస జెప్పసాగు
నది విని కలికిరో యిది యేమి! యన నవ్వితలవంచి తనకోర్కె దెలుపవెఱచు


గీ.

దయగలిగిగూడ తిన్నతిన్నగయటండు బాల సుఖియించి యింక నెప్పటికి నన్ను
విడువవలదంచు బలికిననుడులసొంపు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఇంత కన్నెరికంబు నెఱుగని చిన్ననా డచ్చికమచ్చికలాడి కూడి
మన సొక్కటిగ చేసికొనినపిమ్మట సిగ్గువిడిచి సందేహంబు లడుగదొడఁగి
నీచేయి దాకిన నాచోట జెమరించు మొలకచన్నులమొనల్ జిలజిల మను
మనసైన యంగుళి మరువింట జొనిపిన నీదుప్రథానంబు నించినట్లు


గీ.

గలుగదు సుఖంబు స్వప్నగరములందు కన్నులకు గప్పినట్లుందు విన్నిటికిని
మూలమెఱిగింపుమన్న యమ్ముగుదమాట మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సరసత నొకదాని సంకేతదినమున నన్యకాంతను గూడి యపుడె వచ్చి
దానితో గూడ నాతమక మించుకయున్న ననుమానపడి పైకి యడరి చూచి
స్మరకేతుబిలము విశాలమై ద్రవముండి కఱకుమీఱియు మొన గడుసుబారి
యున్న విదానించి యుపరతికి గడంగి నిలుపక సేయుచు నెలతనాదు