పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూమిక

మ. రా.రా. శ్రీ సెట్టిలక్ష్మీనరసింహము గారిచే రచింపఁబడిన 1 జాబులు - మొదటిభాగము. 2 జాబులు - రెండవ భాగము. 3. సరసోక్తియుక్త కృష్ణశతకము. 4 సరసచాటువులు, 5 కవిసార్వభౌమ శ్రీనాథకృత మగు - రసికాభిలాషము. ఇంక నితరకవుల చాటువులు. ఈయైదింటి నిందు ముద్రించి శృంగారపంచక మని నామకరణ మొనర్చి 4వ గ్రంథముగా వెలువరించితిమి. కావున మా చందాదారు లెల్లరు సాదరముగా నాదరింతురని తలంచు చున్నారము. మాకు సర్వహక్కుల నొసంగి యీశృంగారపంచకమును మాచే వెలువరింపఁ జేసిన శ్రీ శ్రీ శ్రీ సెట్టి లక్ష్మీనరసింహముగారి కెంతయు కృతజ్ఞులము,

స్వవిషయము: — ఆంధ్రరతిరహస్యము కొఱకు చందాదారులంద ఱాత్రముతో వ్రాయు జాబు లందుకొను చున్నారము. రతిరహస్యమున మేము బ్రకటించిన యర్థచౌశీతి కాక మిగిలిన యర్థచౌశీతి బొమ్మలు మా యశ్రద్ధవలన చెదపురుగుల పాలాయెను. కనుక సంభోగసమయమున నిజముగాఁ దీయ బడిన యన్యదేశీయుల ఛాయపటముల నుండి చేయఁ బడిన చిత్రములతో నాంధ్ర రతిరహస్యమును వెలువరింపఁ దలఁచితిమి. ఇంక నారుమాసములలో 5వ గ్రంథముగా నాంధ్ర రతిరహస్యమును వెలువరింపఁగల మని చందాదారులకుఁ దెల్పుకొను చున్నారము.

10-12-1922

ఇట్లు

పుదుచ్చేరి

యస్ చిన్నయ్య.