పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాయ మూహించి నైపద్యంబు జడకుండ నొకకంబ మూనుకయుంటి నేను
పడఁతి నాతొడలపై పదములుంచి కరాబ్జములు నాదు మెడకు లంకెలు ఘటించి


గీ.

యేను చేతుల తననడు మెత్తి పట్టుకొన నగారూఢమునఁ గూడి కోర్కె మీఱ
తనమనసు దీర్చుకొన్నట్టి దానిసొబగు మదిఁతలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

పూబోడి యొక్కతె పురుషాయితమున నీదగుశక్తిఁ జూతునా యనుచు లేచి
చెలగి పైకెక్కి బస్కీలు సేయగ నొక్కమాటు నే వంచించి మీటె తొలగ
నిడిన వంకర దిద్ది యెడనెడ నవ్వుచు నభిముఖంబుగ నుండి యంత మీఁద
ఘటచక్రముగ నది కడువేడ్క ఱివ్వున తొలగి పోనీక వెన్కలకు దిరిగి


గీ.

కొంతసేపు రమించి దా నంతమీఁద మఱల నెదురుగ దిరిగి సమంబు గాఁక
సుఖము గలుగంగజేసినసొంపుపెంపు మదిఁదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

గ్రామ్యబంధముననే రతిసేయనిది జాణతనము గావింక నీవు వెనుక దిరిగి
నేర్పునఁ గ్రీడింప నిను మెచ్చుకొందునో యనఁగ నే నారీతి వెనుక దిరిగి
యురమును వంచించి యెప్పుగా దానిపిఱుందుల పైకొచ్చి యంద మలర
సరిజేసి సురతంబు సలిపిన భళిర నీయట్టి విసగ్ధుని నవని నెందు


గీ.

నెఱుఁగ నింక సమంబుగాఁ దిరిగి కేళిసలుపు మన నట్ల జేసి యాచెలికి తృప్తి
గలుగఁజేసిననాఁటి కోమలిసుఖంబు మదిఁదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఎలనాగయును నేను నిలువుటద్దములలో సొగసుగా నొకనాడు చూచుకొనుచు
పెక్కుబంధంబుల బెనఁగొని క్రీడించి యలసటఁగొని సరికళలు విడిచి
వరుసఁ గూర్చుండి యెండొరుల చెమట లార్చుకొనుచు కళావిసర్జన మొనర్చు
టకు నిల్పుకొనుట కెంతయు సమర్థులమైన మనకు నిర్వురకే సామ్యంబు కాని


గీ.

కళలు రతివేళ తమయిచ్చకొలది విడువ నాగికొననేర్పులేనివా రవని రసిక
తములె? యని లేమ యన్నయందంపుమాట మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ప్రణయకోపమున నే బవళింప దగ్గఱిముద్దాడ చా ల్సాలు పొమ్మటంచు
విదలించివైచిన విడుతునా యని మీసములు దువ్వి పైబడి కలియరాగ
నటునిటు దప్పింప పటభూషణము లూడ్చి జట్టిపోరాటంబు సలుపుటకును
వదలక పైవ్రాలి కదలకుండఁగఁ బట్టి మకరధ్వజముఁ గొని మరునియింట