పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఉత్సుసత్వమున నన్నొకనాడు పైకొన్న చెలికి లో మెరిపింపు వలన మిగుల
సౌఖ్యరూపకపరిశ్రమము బాటిలఁజేయ తాళలేనని యది తత్తఱమున
నక్కు వ్రాలి దామ్రొక్కుచు కళవింప గమకింప నది చూచి కరములేను
బలు పిఱుందులకు లంకెలు వైచి చంద్రనాడికి రాపుఁ జేఁయదప్పక తనంత


గీ.

చిలుచిలు మటంచుగళ జాఱజిక్కి "నీకు దక్కితి యింక నన్ను గదల్పకుండు"
మనుచు బతిమాలుకొన్న యవ్వనితహొయలు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సమబంధ మొనరించు సమయంబునను వీకగళలంటి చూచుకంబులు స్పృశించి
మొనసి పాదాంగుష్టములు మోపి పైకుబ్బి కాయజచ్ఛత్రసంఘర్షణంబు
గా రతిక్రియ సల్ప గనుగొని యిది యేమి యాతురం బింతలో నకట తృప్తి
గావించుటకు నీవు గమనించెద వటంచు కుర్నీషు చేసి నా కోర్కె తీర


గీ.

రతి యొనర్చినపిదప నీలాటి పనులు సేయదగు గాని యిప్పుడే సేయదగునె
యనుచు నను వేఁడుకొన్నయయ్యబలసొంపు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

సుదతి యొక్కరు నే నెదురుగా గూర్చుండి మొనసి సేతులు వెన్క మోపి యుబికి
తగరుఁ తాకుల కొంతతడవు మెప్పులుగాంచి యట మేథూనమున నేనబ్జనాడి
మీటిచు మొనలంట మెలఁత చన్మొనలు చక్కగనొక్కి రసనచే గదలఁజేసి
యవ్వల కెమ్మోని నానుచు చూచుకంబులు కరంబుల నంటి కళలు రేపఁ


గీ.

కదలనీయక చేత లింగంబు బట్టి కమలశరుడోలికను కఠోరముగ నూచిఁ
కళను చిలచిలమని కుమ్మరిలగ జేసి పరవశత్వము నొందిన పడతి పొగను
మదిదలంప బ్రహ్మానంద మదియ కాదె


సీ.

మునికొని గోబంధమున నేను గూడిన నాతి హస్తము లుర్వి నూతఁజేసి
కొని యెదురెత్తుచు దననితంబము నెత్తి రహి నిల్వ పవనపూరణముచేత
మరుగేహము తరతర యను నాదంబు వెడల నేనవ్విన వ్రీడనొంది
తడయక లేవనంతకు కిర్రుమన తలవంచి యూరులు బిగియించి కదల


గీ.

కున్న గనుగొని దానిచె య్యిడిచిపట్టి పొలుపుమీఱంగ విరులపాన్పునకు దీసి
కలసి హాయి యొనర్సిన క్రమములన్ని మరిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

తరుణి యొక్కతె నేను దిరునాళతఱి నలంకారము గావించి కౌతుకమున
వేడుక చూడంగ వెడలునప్పుడు రతి గావింప మనసైన గలయుటకును