పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

దైవతాంతరముల వీడి, తనుభజించునతని రక్షింతుననుచు తా నన్నమాట
సత్యముగ జేసె నద్దేవు సన్నుతింతు నంచితముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ధరలోనఁ దా నవతార మొందెడువేళ తన యోగమాయఁ గన్గొని సమస్త
జనులకు కామదాయివివయి యుండెదవీవు నిన్ను జనంబు పెక్కు
నామధేయంబుల నయముతోఁ గొలిచెదరని ప్రీతి నిచ్చిన ఘనవరమున
కనుగుణంబుగను కాత్యాయనిపూజలు చేయ గోపాలకస్త్రీల చేల
ములు గొనుటది వారు జలములో నగ్నలై ప్నానంబుచేయుదోషము నడంచి
తనకర్థి మ్రొక్కించుకొని వారివ్రతము సేయుటకె కా కతులితముగ
ద్రౌపదీదేవి తన్ దలఁచినమాత్రాన పెక్కువస్త్రములు కల్పించి యిచ్చి


గీ.

నట్టి దివ్యప్రభావున కంబరములు లేక కాదు కామాసక్తి లీలగాదు
అట్టియోగీశ్వరు నాదిదేవు నభినుతింతు బ్రహ్మానంద మదియకాదె.


సీ.

నూనూగుమీసాలనూత్నయౌవ్వనుఁడును నలువొప్ప మధురగానంబు సేయు
పురుషుఁడు తరుణున కరయ వల్లభుఁడంచు పలుమాఱు వేదంబు బలుకునుడువు
నిజము సేయుటకు దా నిత్యకైశోరసుందరవిగ్రహము దాల్చి సరసభంగి
భువనమోహనముగా మురళీవినాదంబు సేయుచు గోపికాస్త్రీలకెల్ల


గీ.

వలపు పుట్టించి మోహించి వారి తనదుకడకు రతికాంక్షఁ జనుదేరగా నొనర్చె
నట్టికృష్ణునిచరితంబు నభినుతింతు నంచితముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

తౌర్యత్రికము సురతక్రియోపకపామగ్రి యని గోవసతులఁ గూడి
రాసోత్సవము చేసె రహి గోపికల కందఱకు నన్ని హరిశరీరములు దాల్చి
మించి సంక్రీడఁగావించి దా యోగీశ్వరేశ్వరత్వము నర్థి నెఱుకపఱచె
నేకకాలమున నేకరూపములతో గోర్కెతీఱ ననేకగోపికలకు


గీ.

వేట్క విధువనతృప్తి గావించి తనదుసర్వసమతయు దెలిపె నాశ్చర్యఫణితి
నట్టిరసికాగ్రణి విలాసఁ మభిమతింతు మదిదలంప బ్రహ్మానంద మదియకాదె.


సీ.

లీల బ్రహ్మానందలేశసన్నిభరతిక్రీడాసుఖంబు లౌకికసుఖంబు
లందు ముఖ్యంబని యనుభవసిద్ధంబుగా నెఱిఁగి జనంబు దానిమీద
నమనస్కసిద్ధిచే ననుభవింపగ నర్హమైన బ్రహ్మానంద మాత్మలోన
నూహించి తగుయత్న మొనరించి కృతకృత్యులౌట కనేకగోపాంగనలను