పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గానిచో యఘటన ఘటనా పటీయ్యసి యగుతన మాయచే జగములన్ని
కర్మవశంబునఁ గదలకుండఁగ గట్టివైచిన యాపరబ్రహ్మ మేల


గీ.

యబలయగు తల్లిచే దొల నట్లు కట్టుబడియె నది చాలతానుకంపవలన గాదె
యట్టి పరమేశుచారిత్ర మభినుతింప నరసిచూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అవని గోబ్రాహ్మణు లనుచు విప్రులకన్న గోవుల మొఁదఁట బేర్కొనుటవల్ల
నావులు విప్రులు కన్నఁ బ్రాశస్తంబు గాంచినవనియు నుత్కంఠతోడ
గోప్రదక్షిణమున భూప్రదక్షిణజాతఫల మబ్బుననియు భావమర్ధి
నెల్ల మానవులకు తెల్లంబు గావించుటకు కూర్మి గోపబాలకులఁ గోడి


గీ.

ప్రేమమీఱ బృందారణ్యసీమయందు పసులచుట్టును దిరుగుచు, కసవు మేపె
నట్టిశౌరి విలాసంబు లభినుతింతు నంచితముగ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అనిశంబు తన్నునమ్మినవారియపమృత్యువులు రోగములఁ బాసి
యఖిలాపద లడంచి యాపన్నగారకుం డనుమాట నిజము చేయంగఁదలచి
యఘదైత్యవదనంబునందు కాళీమహ్రదాంబుపానమున నీ రైనగోప
బాలగోగోవత్సజాలంబులను సురామయవీక్షణంబుల మనఁగజేసె
నంతియగానిచో నట్టియాపద వారి కేయెడ లేకుండఁ జేయలేఁడె


గీ.

కర్మమును దాటఁ గాదను, గాథ యితరజనములకె కాక నిజభక్తజనులఁ జేర
దనుట నిజముచేసినహరి నభినుతింతు నరసిచూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

హరిహరవిధులు నిజాంశసంభూతులై ననుతమయోగమాయను తరింప
లేరను యర్థంబు నారక వివిధకారణములు లేకనే వ్రజకుమార
వత్సరూపంబులు వరుసతో సృజియించినట్లు విశ్వంబు నేపారసృష్టి
గావించు పటుశక్తి గలదను నర్థంబు క్షితిలోనఁ బ్రకటింపజేయుటకును


గీ.

అజుఁడు దాచినబాలవత్సాకృతుల ధరించి యొకయేఁడు మందలో సంచరించె
నట్టికృష్ణుని శుభలీల నభినుతింతు నమితమైన బ్రహ్మానంద మదియకాదె.


సీ.

ఏఁటేటఁ గావించు నింద్రయాగమునకు సమకూర్చిన పదార్థజాత మెల్ల
తనమాట నమ్మి శకృనకు నొసంగక యచలాకృతి ధరించినట్టి తనకు
నిచ్చినందున నిర్జరేంద్రువలన గల్గిన యువద్రవ మణఁగింప గేల
గోవర్ధననగంబు గోర్కెతో నెత్తి గోగోపగోపికలను గూర్మి బ్రోచి