పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని వినయవిస్రంభగంభీరసంరంభంబులు గుంభింప పలుక,
నచ్చిలుకలకొలికి కంతకంతకు వింతవింతలుగ దురంత నితాంత విప్ర
లంభ వేదనాభరంబు భరింపరాకుండ కరంబు దళంబుగా బరవశ
త్వంబు నొంది మారుమాటాడ నోడి, ఓడిన కోడి చందంబున
తల వ్రేలవైచుకొని, కదల మెదల నేరక కన్నులు మూసికొని, యూరక
శరీరంబు నీరు విడువ శయ్య నొయ్యన వ్రాలి తూలం కనుంగొని
బెంగను లొంగి దుఃఖాంభోధి మధ్యంబున మునింగి కన్నీరు లేఱులై
పారి వెల్లివిరియ డిల్లపడి తల్లడంబున నుల్లంబవియ మెల్లమెల్లన
నప్పల్లవ మనోభూతంబున కాతతగతి చల్లనిపనులు సేయందలంచి
తన దాసికాజనంబులుం దానును దాని నిజశయ్యాతలంబునం జేరి.

75


సీ.

భగమధ్యమున మంచిచిగురుప్పుఁ గూరించి
            పైఁ గొండనల్లేరు ప్రస్తరించి
లంబస్తనప్రదేశంబున రేవడి
            దూలగొండిచిగుళ్ళు గీలుకొలిపి
కన్నులలోన నర్కక్షీరములు నించి
            ముక్కుగూండ్లను ఆవముద్ద లుంచి
వీనులలోపల వేఁడినూనియ పోసి
            నాలుకఁ జెముడుపా ల్చాలఁ బొడిచి.


గీ.

మేన ఱాసున్న మెంతయు మెత్తి, నెత్తి
గొఱిగి, నిమ్మపులుసు గంట్లఁ గ్రుమ్మి, లోని
కిముడ నేపాళము లొసంగి యిట్లు శిశిర
కృత్యములు సేయ, అప్పు డక్కితవవనిత.

76


క.

బడబడఁ బిత్తులు పిత్తుచు
బడిబడి బహుభంగి మీఱఁ బాఱుచు మరి తా
నొడ లెఱుఁగక పెనుమూర్ఛం
గడు సోలఁగఁ దల్లి కాంచి కటకటపడుచున్‌.

77


ఉ.

వేంకటసోమయాజి కిది వేగ మెఱుంగగఁ జెప్పకుండినన్‌
గింక వహించి దుఃఖపడుఁ గేవల మాతఁడె దీనిఁ గన్నవాఁ