పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

తలప సర్వజ్ఞునకు సర్వశక్తియుతునకు పారవశ్యంబుగలదె
యట్టి కృష్ణుని చరితంబు లభినుతింతు నతులమైన బ్రహ్మానంద మదియకాదె.


సీ.

అరయ నెవ్వాని వీర్యంబున విరజకు బుట్టిన తనయు లేడ్వురును సప్త
వసరాసులైరి యెవ్వడు సృష్టిగావింప రాధతో గూడి సురతము సేయు
తఱి మేన బొడమిన తతఘర్మజలము బ్రహ్మాండముల్ నిండి యేకార్ణవంబుఁ
గావించె నట్టిజగత్కర్త కృష్నుండు జనని దోయిట నీట స్నపితుడగుచు


గీ.

భక్త సుకృతోపచారంబు స్వల్పమైన నదియ సంతుష్టికరమని యన్నమాట
సత్యముగ జేసె నవ్విభు సన్నుతింతు ననుపమానబ్రహ్మానంద మదియకాదె


సీ.

దాటరాని భవాబ్ధి దరియించుటకు తవరమ్యపాదాబ్జమరందపాన
మదియ ముఖ్యోపాయమనియు నాత్మీయంగములలోనఁ దలపోయ మోక్షలక్ష్మి
కంఘ్రులే కుచ్యంబు లనియును భక్తుల కెఱిగించుటకే కాక యింపుమెఱయ
బంగారుతొట్లలో బవళించి కరముల చరణంబు వదనకంజమున జేర్చి


గీ.

మొనసి యంగుష్టమానుట జనని పాల దనివిదీరక గాదట్టి యనఘమూర్తి
రమ్యలీలావిలాసవర్ణన మొనర్తు నరసి చూడ బ్రహ్మనంద మదియకాదె.


సీ.

పశువులు ఫణులు గానరసంబు నెఱుగుఁదు రను వాక్య మెఱుక పరుప
గానంబు సర్వదుఃఖంబుల నడచి జడంబులకైన సుఖంబు నొసఁగు
ననునది ప్రకటింప నదిగాక, తా సామగానలోలుండను గాథ తథ్య
మొనరింప జనయిత్రి యొఱపైన చికిలిబంగరుతొట్లలో నుంచి క్రమఫణతి


గీ.

పాటఁపాడుచు నూచిఁనఁ బవ్వళించి నేత్రములు మోడ్చి సుఖలీల నిద్రబోయె
నట్టిశౌరివిలాసంబు లభినుతింతు నరసిచూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

వ్రేపల్లెలో నున్న గోపాలకుల నెల్ల నాఢ్యుల గావింతునని తలంచి
పుడమి నకారణంబుగ సిరి నొసగిన నస్మదుక్తి విరోధ మగును గాన
నెటులైన వీరి సొమ్మించుక యైనను మెసవి సౌభాగ్యంబు నొసగుటొప్పు
నవి వారి సదనంబు లందున్న వెన్నయుపాలు మ్రుచ్చిలి మెక్కి భాగమొసగె


గీ.

నల కుచేలుండు గొనితెచ్చినట్టియటుకు లొడిసికొని తిని యైశ్వర్య మొసగలేదె
యట్టికృష్ణుని శృంగార మభినుతింతు నరసిచూడ బ్రహ్మానంద మదియకాదె.


సీ.

తను భక్తి ననిసంబుఁ గొనియాడువారి కిప్పగిది నధీనుండ నగుదు ననెడు
భావంబు తెల్లంబుఁ గావించుటకు ఱోలకరమర్థి తల్లిచే గట్టుపడియె