పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యపశబ్దములకు రోయక సంధివిగ్రహ
            ప్రాణహానివిచారపరత దక్కి
భావం బెరుంగక పండితోత్తములతోఁ
            గలయ నొల్లక మహాకపట మూని.


గీ.

యతులఁ బోనాడి మూర్ఖసంగతి వహించి
తిరుగు వెలబోటి జీవనస్థితి గణింపఁ
గుకవికృతకావ్యరూపానుగుణతఁ బూని
యరసి చూచిన నిస్సారమగును బిదప.

32


క.

లంజెయును బీఱకాయయు
ముంజెయు బాల్యమునఁ జాల మోహము గొలుపున్‌
రంజన చెడి ముదిసిన వెను
కం జూడరు ముట్టఁబోరు గద నరు లెందున్‌.

33


చ.

పలువలు చెంతఁ జేరి యొక పాతికనేబులు చేతికిచ్చి ఛీ
మొలఁగల బట్టవిప్పి తగ ముందుగఁ బాన్పున నుండి వార లే
పలుగుఁదనంపుఁ గూటముల బాధలు పెట్టిన నోర్చి పూనికన్‌
గులుకుచు నుండు నప్పడుపుకూటివెలంది కొలంబుపెద్దయే.

34


సీ.

పరధనాకర్షణప్రాంతంబు స్వాంతంబు
            వ్యర్థమాయావచోవ్యసనరచన
శఠవిటోచ్ఛిష్టాదిసదనంబు వదనంబు
            పలుబొజుంగులచొంగఁ బావి మోవి
పల్లనభయదకృపాణులు పాణులు
            కుటిలాఘవితతులకోపు చూపు
కృత్రిమగుణగణగేహంబు దేహంబు
            షిద్గసంఘంబుల సెజ్జ బొజ్జ.


గీ.

పంచసాయకరోగప్రపంచఘోర
యాతనాదూయమానప్రయాతవిటప
మదసలిలయుక్త మగు దోని మలపుయోని
కనుఁగొనఁగ వేశ్య హేయభాజనము గాదె.

35