పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక్షణములు బూఁతులతోడనే బూరింపఁబడినవి. ఇవిగాక యాంధ్రమున –.

క. నీతుల కేమి యొకించుక
       బూఁతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
       నీతులు బూఁతులు లోక
       ఖ్యాతులురా కుందవరపుఁ గవి చౌడప్పా.
క. పదినీతులు పదిబూఁతులు
       పదిశృంగారములు గల్గు పద్యములు సభం
       జదివినవాఁడే యధికుఁడు
       గదరప్పా కుందవరపుఁ గవి చౌడప్పా.
క. బూఁ తని నగుదురు తమతమ
       తాతలు ముత్తాతమొదలు తరతరములవా
       రే తీరున బూఁ తెఱిగిరి
       ఖ్యాతిగ మఱి కుందవరపుఁ గవి చౌడప్పా.

ప్రాచీనకవులు హాస్యరసపోషణమునకు బూఁతులే ప్రధాములని యూహించిరో? నీతిబాహ్యప్రవర్తనములయెడ రోఁత పుట్టించుట కవి ముఖ్యములని యెంచిరో? రాజ్యసంక్షోభాదులవలన నీతుల చెడిన తమకాలమునాఁటి జనతాస్థితిని కావ్యదర్పణములం బ్రతిఫలింపఁజేసిరో? గాని యాంగ్లమునఁ గూడ హోమరు వర్జిలు వికటకవిత్వపుపోకడ లిట్లే యుండునని బ్రౌనుదొరగారే వ్రాసిరి.

సంపూర్ణవికటకవితామహత్వమునం జేసి నిరుపమానమై యపూర్వకల్పనాశిల్పవైదుషీమనోహరమై ధారాళమై నీతిబోధకమైన యీహాస్యరసప్రబంధరాజ మజ్ఞాతవాసము పాలు గాకుండ కళాపోషణమునకైనను సురక్షితముగా దాచి యుంచవలె నని మాయుద్దేశము.

మఱియు నాకాలపు బ్రాహ్మణులయొక్కయు కవులయొక్క నవినీతులను దెల్పుచు, సాంఘికకల్లోలములను వెలిబుచ్చుచు