పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

       ధానిధానము ద్విపదయు సుభద్రాపరి
                         ణయము నుమాసంహితయును దండ
       కములును బహుశతకములును గీతప్ర
                         బంధముల్ ఖడ్గాదిబంధములును
       గద్యలు రగడలు ఘనతరమంజరుల్
                         బహుసువృత్తంబులు భాసురముగఁ.
గీ. జెప్పి శ్రీ పురుషోత్తమక్షేత్రపతికి
       శ్రీ జగన్నాయకులకు నర్చించి మించె
       ధైర్యగాంభీర్యచాతుర్యశౌర్యముఖస
       మిద్ధగుణపాళి జగ్గకవీంద్రమౌళి.

ఇతఁ డిన్నిగ్రంథములను రచించినను బూర్వప్రబంధమార్గమునే త్రొక్కియుండెను. గావున సర్వసాధారణకవిగా నెన్నఁబడెడివాఁడె గాని మానవవ్యవహారములను బ్రదర్శించు పాత్రలను జిత్రించుచు హృదయంగముగానుండి హాస్యరసప్రబంధరాజం బనందగు నీ చంద్రరేఖావిలాపమును రచించుటవలన నీతని యసాధారణప్రజ్ఞయు, నపూర్వకల్పనాశక్తియు, నాత్మగౌరవపురస్సరమగు పౌరుషాతిశయమును, వేయినోళ్ళ నుద్ఘాటింపఁజాలు శాశ్వతకీర్తికిఁ గారణమైనది.

క్షీరసముద్రమువంటి యీ గ్రంథరాజమును బూఁతులతో బూరించుటవలన నీ యిరువదవ శతాబ్దమున గర్హింపబఁడుచుండుట కేవలము కాలముయొక్క దోష మనవచ్చును.

పూర్వకాలమున బూఁతును నిప్పటివలె దోషముగాఁ బరిగణింపక గుణముగాఁ బరిగణించినటులఁ గానవచ్చుచున్నది. కావుననే జగ్గకవి “బూఁతులన్ బూర్ణుఁడ” వని ప్రభువు తన్ను నుతించినటుల వ్రాసుకొనెను. మఱియు సుప్రసిద్ధకవులగు కాళిదాసు డిండిమాదులంతవారు సైతము సంస్కృతమునఁ దమ ప్రహసనములను బూఁతులతోఁ బూరించిరి. ప్రతాపరుద్రీయాదులందలి హాస్యరస