పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక్కగంతులో దగ్గఱఁజేరి యాచిఱుతరోఁకలిని చేతనందుకొనఁ జూచితిని గాని యది యిముడలేదు, చేత నిముడుటలో పైచర్మము వెనుకకు పోయి, మంచులోఁ దడిసిన మందారపువ్వువంటి ద్రవసహితమైన యెఱ్ఱని తల చిఱుపెదవులతో వెలికి వచ్చినది. ఆతడి నాచేతికంటినకొలఁదిని, నాభగము మఱింత యూటలూరసాగినది.

ఈసందర్శనోత్సవములో నేనుండి యాతఁడేమి యొనర్చుచున్నది గమనించుటలేదు గాని, గుబ్బలు గోరులు దిగునట్టుగా పట్టుకొని పెదవి కందిపోవునట్టుగా ముద్దిడుకొనుచు, క్రిందకుఁ బడద్రోసినాఁడు. పాదములవద్ద గూర్చుండి తొడలు విడదీసి, లోనికి జరిగి, భగము పెదవులయంచున నాపాలిటి యమృతదండంబును దాకించి పెదవులు చేతులతో విడఁదీయుచు మెల్లగాఁ ద్రోయ మొదలిఁడినాఁడు. ఆతఁడటుల జేయుచున్నకొలఁదిని మేనుమఱువంజొచ్చిన పారవశ్యములోనే వింతపడంజొచ్చితిని. ‘నా కంత రంధ్రమున్నదా! బడితెవలె నున్నదే! దానినంతయు ద్రోయవలెనన్న నెటులఁబట్టునో?’ ఇంతలో దానిపనియది జూచుకొనుచునేయున్నది. లోనికి చొచ్చుకొనుచున్నకొలంది, యున్నలావుచాలకకాబోఁలు నింక పెరుగుచున్నది.

ఆవంచకుఁడటుల నెమ్మదిగా ద్రోయువాఁ డటులనే యొనరింపక నొక్కత్రోపులో సరాసరి దానినంతయూ దూర్చినాఁడు. నొప్పిచే కెవ్వుమని యఱచి వదలించుకొన జూచితినిగాని, యాతఁడు నాచనుల గుత్తంబుగాఁ బట్టుకొని, యింకనేమైన రవంత మిగిలియున్నదేమో దానిని గూడ నెట్టినాఁడు. మాయిరువురి శష్పమహారణ్యంబులు నేకములైనవి.

వెనుకకు క్రమముగా లాగి, యూఁపుగా ముందఱకు నెట్టుచున్నాఁడు. ఒక్కొక్కతాఁకు నాకు బొడ్డునకుఁ దగులుచున్నది. ‘నొప్పి’ యని కేకలు వేయుచు గునియుచుంటినేగాని భగమున నిరుకుకొనినదానిని వదలించుకొనవలయునని లేదు. క్రమముగా బాధ పులకరింతగా మాఱినది. ఆతనిమెడకు చేతులు లంకెలు వైచి మీఁదకు లాగుకొని యదిమిపట్టితిని. ఆతఁడు ‘యిప్పు డెట్టులనున్నది. ఇంకనూ ద్రోయనా యీయూపు