పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

మదనానువర్ణనము


...........అంతఁ గామరూపదేశాధీశు ననుంగుపట్టి యగు రతిమంజరి, సురతకళావిదగ్ధయయ్యునూ, ప్రోడతనంబు మాటువఱచి ముగ్ధభావం బభినయించుచూ సిగ్గుచే మాటలు తడంబడినటుల గాద్గదికంబు నెపంబున గళరవంబుల దనకుంగల జాతుర్యమును జాటుచూ, సపత్నిమండలంబును వేడుకలఁ గొంతతడ వాయాసపఱచి, యెట్టకేలకు బలవంతంబును నియ్యకొనినదానింబలెఁ బ్రసన్నభావంబున, పొగరెక్కి యుక్కుమిగులు గుచంబుల బయ్యెంట సరిదిద్దు నెపంబున నదిమికొని, యిటుల మొదలిడినది.

నాతొలికూటమి చిత్రవిచిత్రగతుల, చిత్రరతుల, జతనుపడినది. మానవాంగననైన నాకుఁ గన్నెచెఱఁ బాపి, భగము నెంగిలిచేసినది, మానవుఁడు కాదు! సమర్తలాడినకన్నెప్రాయమున చూపరుల నోరూఱించు రూపవైభవంబుతోఁ జెన్నారుచుఁ దలిదండ్రుల కేకైకపుత్త్రి నైనందున, లోకమునందలి రాజకుమారికలఁబలె నంతిపురంబునఁ బడి మ్రగ్గుచు నసూర్యంపశ్యనుగా నుండక, వార లనుమతింపఁగా, మగవానిఁబలె, నొంటిమై, తలఁచినప్పుడెల్ల దూరవనులకు విహారముగా నేగ నలవడియుంటిని.

నా కప్పటికి పదునెనిమిది వత్సరములు. ఋతుమతినై మూఁడుదినంబు లిలు వెడలనందున, నాలవనాఁడు స్నానానంతరము, మిక్కిలి యుత్సాహముతో, ననుదినముకన్న నెక్కుడుదూరము పోయి, వాజి డిగ్గి, యలసినదాననౌట, కొండదరినంటి ప్రవహించుచున్న సెలయేటియందు, నగ్ననై యిచ్చవచ్చినగతి నీఁదులాడుచు, వారిక్రీడ మార్గాయాసం బపనయించునటుల నొనర్చి, నీరంబులు వెడలి యొడ్డునకుఁ జేరి, నామేనిబంగురునకుఁ జికిలిమెఱుఁగులు దిద్దు భానుని తరుణారుణాతపంబున నొడలు విరుచుకొనుచు నిలుచుంటిని. నాకన్నుల కదేలకో ప్రకృతి పులకరించినగతి, వనీస్థలులన్నియుఁ దొంటిబలెఁగాక నెక్కుడు మనోహరంబులై గన్పట్టినవి. నాయమాయికహృదయమునం దనుశ్రుతితో, రూపేర్పఱుపరాని మధురభావనలు దోఁచినవి. ఒడలెల్ల నెందులకో బరవశింపఁజొచ్చినది. కలలు నిందచూపులతో మదాలసతను మందంబుగా సింహావ