Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాని తగిన శక్తి ఉండదట. అట్టివారిని ఊరికే వదలివేస్తే వారు కష్టాల పాలౌతారట. అంచేత వారికంటే ఎక్కువ శక్తి, ఎక్కువ ప్రజ్ఞ, ఎక్కువ అనుభవం ఉన్నవారు, వారి పరిపాలనా భారాన్ని స్వీకరించి, వారికి క్రమక్రమంగా స్వరక్షణశక్తినీ, స్వపరిపాలాదక్షతనూ కలిగించాలట. ఇలా చెయ్యడం ఆ ప్రజలకే కాకుండా, మానవజాతికి, సభ్యతకూ, సేవచెయ్యడమట. "మేండేటరీ విధానం" అంటే ఇదే! ఈ విధానం పేరు చెప్పే బ్రిటన్, ఫ్రాన్సు రాజ్యాలు ఇరాక్, పాలస్తీనా, ట్రాన్స్ జోర్డాన్, సిరియాలను కబళించారు.

10

"యూదులకు జాతీయ కేంద్రాన్ని స్థాపించడం, ఆరబ్బుల జాతీయ కేంద్రాన్ని కాపాడ్డం, మొత్తం జనాభా అంతటికీ స్వపరిపాలనా విధానంలో శిక్షణ ఇవ్వడం"- ఈ మూడు ఆశయాల్ని సాధిస్తానంటూ బ్రిటన్ పాలస్తీనాపై మేండేటరీ అధికారాన్ని స్వీకరించింది. కాని, అది ప్రారంభం నుంచీ కూడా యూదుల పట్ల పక్షపాతాన్ని చూపసాగింది. "ప్రారంభం నుంచీ కూడా యూదుల పట్ల పక్షపాతం" అని అనడానికి తిరుగులేని నిదర్శనం ఇది: ఆలెంబీ ప్రభువు జెరుసులంను జయించిన తర్వాత, పాలస్తీనా పరిపాలనకు మిలిటరీ గవర్నమెంట్​ను ఏర్పరిచారు. ఈ మిలిటరీ గవర్నమెంట్​ను తప్పించి, సివిల్ గవర్నమెంట్​ను ఏర్పాటు చెయ్యడానికి 1920లో బ్రిటన్ పంపించిన మొట్టమొదటి హైకమీషనర్ యూదు జాతికి చెందిన సర్ హెర్బర్ట్ శామ్యూల్!

ఒక వైపున బ్రిటన్ అభిమానం ఉంది; ఇంకో వైపున అంతర్జాతీయ యూదీయ సంఘాల ధన సహాయం ఉంది. ఇంకేమీ కావాలి? యూదులు పాలస్తీనాకు విరివిగా వలస రాసాగారు. వచ్చి, వారు ఆరబ్బుల భూముల్ని కట్టుకున్నారు; ముఖ్యమైన ప్రభుత్వోద్యోగాల్ని సంపాయించుకున్నారు; ఎన్నదగిన పరిశ్రమల నన్నింటినీ వశపరచుకున్నారు; పాలస్తీనా పరిపాలన టర్కీ నుంచి తమకు సంక్రమించినట్టే చేసివేశారు.

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం లండన్ నగరానికి వెళ్ళిన ఆరబ్బు డెలిగేషన్ వారు తమ దుస్థితిని ఈ విధంగా వర్ణించారు:

"హైకమీషనర్ యూదీయుడు; లీగల్ సెక్రటరీ, స్టోర్స్ కంట్రోలర్, ఇండస్ట్రీస్ డైరెక్టర్, చివరికి, వలస శాఖాధికారి- అందరూ యూదీయులే! ప్రభుత్వపు ప్రతి శాఖనూ యూదీయులే వశపరచుకున్నారు.

"ఆరబ్బుల స్వాతంత్య్రాన్ని అరికట్టడానికీ, వారి అభివృద్ధిని ఆటంకపరచడానికీ, శాసనాలను చేస్తున్నారు. పత్రికలకు స్వాతంత్య్రం లేదు. దేశాభిమానులైన ఆరబ్బుల్ని వారు ప్రజా క్షేమానికి ముప్పు తెస్తున్నారనే నెపంతో అరేస్టు చేస్తున్నారు.

"పాలస్తీనాలోని భూములన్నీ కూడా ప్రభుత్వం వారి ఆస్తులట. తరతరాల నుంచి ఆరబ్బుల హక్కుభుక్తాలలో ఉన్న భూముల్ని సయితం వశపరచుకుని, ఇవి మీకే తిరిగి కావాలంటే మా