Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వివరించుచు, ఈ వార్తికములు మూలసూ, తములకు స మ గ్ర త చేకూర్చుచున్నవి. పాణినికి రెండువందల సంవత్సరముల తరువాత అనగా క్రీ. పూ. 350 సంవత్సరముల నాడు నిర్ణయము, డుండెనని కాత్యాయను చరిత్రకారుల కాత్యాయనుడు దాక్షిణాత్యుఁ డని కొందఱి యూహ. 'వేద’ 'లోక' శబ్దములకు బదులు, తదితరూపములైన 'వైదిక' 'లౌకిక' శబ్దము లీయన వాడియుండుటచే పతంజలి ఆయనను "ప్రియతద్ధితాళి దాక్షిణాత్యాః" అని దాక్షిణాత్యు డని పేర్కొన్నాడు. పాణిని సూత్రములును, కాత్యాయనుని వార్తికములును బహు ళముగా ప్రచారములోనికి వచ్చి, ఆపిశలి, కాశకృత్స్నుఁడు, వైయాఫ్ర పాచుఁడు, వ్యాడీ 'మొదలగు పూర్వవ్యాకర్తల రచనలు క్రమముగా మఱుగుపడినవి. సూత్రప్రాయముగా నున్న అష్టాధ్యాయి యందలి విశేషార్థములు గురుశిష్యపరంపరలో సంప్రదాయికముగ బోధింప బడుచు నవిచ్ఛిన్నముగ నిల్చియుండెను. పాణినీయ వ్యాకరణము పాఠము చెప్పునప్పుడు, కొన్నికొన్ని అవసరములైన సంకేతములును, పరిభాష లును కల్పింపబడుచుండెను. కాల క్రమమున మూలనూ, తముల వివర ణములును వాని తొట్టతొలుతటి యభి ప్రాయములును భాషాప్రవాహ మున గల్గిన మార్పులకు సరిపోవక వాని యర్థములును వ్యాప్తియు సందేహాస్పదములు కాఁజొచ్చెను. T ఇట్లు మఱి రెండు శతాబ్దులనాటికి అనగా క్రీ. పూ. 150 సంవ త్సరము నాటికి పాణినీయ వ్యాకరణమునకు విపులమైన వ్యాఖ్యాన 'మావశ్యక మయ్యెను. పతంజలినంటి సర్వజ్ఞులు, తమ తమ బుద్ధి వైశ ద్యమును బట్టి సూత్రములకు ధార్కిక సమ్మతము లగు అర్థములను వివ రించుచు, శబ్దరూపములను నిష్పన్నము చేయఁజొచ్చిరి.