4 పాఠజ్ఞ • మహాభాష్యము అ. లోకము వలన - ఏమన ! లోకమున నా యా యర్థములను మనసున గ్రహించి దాని కనువగు శబ్దములను ప్రయోగించుచున్నారు. కాని వాని నిర్మా నిర్మాణము నాకు ప్రయత్నమును జేయుట లేదు. కుండంలో పనిచేయఁ దలచినవాఁడు కుమ్మరి యింటికి పోయి “నాకు పనియున్నది కుండను చేసి యిమ్ము” అని యడిగినట్లు శబ్దసులను ప్రయోగింపఁ దలచినవాఁడు వైయాక రణు నింటికి పోయి “నేను శబ్దములను ప్రయోగింపవలెను. తయారు చేసి యిము యిమ్ము” అని యడుగుట లేదు. ఆ యా యర్థములను | గ్రహించి తనంత తానే శబ్దములను ప్రయోగించుచున్నాడు. యది తర్హి లోక ఏషు ప్రమాణమ్, కింశాస్త్రేణ క్రియతే ? అ. లోకమే శబ్దముల విషయమున ప్రమాణ మయిన, మఱి వ్యాకరణ శాస్త్ర మెందులకు ? లోకతో ర్థప్రయుక్తే శబ్ద ప్రయోగే శాస్త్రేణ ధర్మ నియమః క్రియతే | అ. ఇతకున కర్ధజ్ఞానము కలుగుటకై లోకవ్యవహారము ననుస రించి శబ్దము ప్రయోగింపఁబడును. శబ్ద ప్రయోగ మట్లు లోకముచేతనే సిద్ధించినను, శాస్త్రము శబ్దము లను ప్రకృతి ప్రత్యయ విభాగము చేసి సుశబ్దములుగ నిరూపించి వానిని ప్రయోగించుటయే ధర్మ మని నియ మించును. కిమిదం ధర్మనియమ ఇతి ? ధర్మాయ నియమః ధర్మ నియమః. ధర్మార్ధ వా నియమః ధర్మనియమః, ధర్మ ప్రయోజనో వా నియమః ధర్మనియమః ॥ అ. "శాస్త్రము ధర్మనియమమును జేయును" అని చెప్పిరి కదా ! ధర్మనియమమనుచోట విగ్రహ వాక్య మేమి? ధర్మముకొఱకు నియమము ధర్మనియమము అని కాని, ధర్మమున్నకైన నియమము
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/81
స్వరూపం