ఈయన నివాసము ఇప్పటి పాకిస్థానులోని లా హోరు సమీప మున పూర్వమునందున్న కౌలాతుర గామ మని తెలియుచున్నది. ఈయన శాలాతురీయుడు, పణిరసూనుడు, దాక్షీపుతుఁడు అని సాంప దాయికముగ తెలియుచున్నది. పాణిని, తన కాలములో శిష్టుల వ్యవహారములోనుండి పరన పారనములలో గల భాషాస్వరూపమును నిర్ధరించినాడు. కాలక్రమమున భాషా ప్రవాహములో గల్గిన భాషా ప్రవాహములో గల్గిన మార్పులు, చేర్పులు వివరించుచు పాణినీయసూ తములకు తరువాతి వైయాకర - ణులు నార్తీకములు వాసిరి. వార్తిక మనగా, - శ్లో. ఉక్తానుక్త దురుక్తానాం చింతా యత్ర ప్రవర్తతే। తం గ్రంధం వార్తికం ప్రాహుః వార్తిక జ్ఞా మనీషిణః ॥ అని పండితులు నిర్వచించికి. సూత్రములయందు చెప్పబడిన దానిని వివరించుచు, వాచ్యముగా చెప్పబడక అధ్యాహారముగా వదలిన దానిని ప్రకటించుచు, అర్ధాంతరములు గల సూత్రములకు ప్రస్తు తార్థములను నిర్దేశించుచు వ్రాసిన సమాలోచన గ్రంధమునకు, వార్షిక మని పేరు. వార్తిక కారులలో నరరుచి పాణినీయసూత్రములకు సమగ్రమగు వార్తికములు రచించినాడు. ఈయన కాత్యాయన గోత్రసంభవుఁ డగుటవలన గోత్రనామధేయమే ప్రసిద్ధమై కాత్యా యను డను పేరనే ప్రసిద్ధుఁడైనాడు. వాణిని సూతములకు ఇతర వార్తిక కారులు చాలమంది వార్తికములు వ్రాసిరి కాని, అవి యన్నియు కాత్యాయనుని నాటికి విస స్మృతప్రాయములైనవి. అందువలన సమగ్రవార్తిక కారుఁడైన కాత్యాయనుడే శబ్దవిద్యా సం ప్రదాయ కర్త లలో ముఖ్యుండై ముని త్రయములో పరిగణనము నందినాడు. "ఇతి వక్తవ్యం, ఇత్యుషసంఖ్యానం, ఇతి వాచ్యమ్, ఇత్యపీ" అనుచు సవర ణల నుపపాదించుచు నార్తికముల వ్యాప్తి అవ్యాప్తి మొదలగునానిని
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/8
స్వరూపం