పస్పశాహ్నికము 177 హము చెప్పుట సంగతమగును. ద్రవ్యము నిత్యము ఆకృతి యని త్యము గదా ! అది యెట్లు తెలియుచున్నది? లోకములో మనము చూచుచున్నాము గదా ! మన్ను ఒక యాకృతితో పిండముని వ్యవహరంపఁబడుచున్నది. పిండాకృతిని చెఱిపి ఘటకలుగను - ఆ యాకృతిని జెఱిపి కుండికలుగను చేయఁబడుచున్నది. అట్లే బంగారము ఒక యాకారముతో బంకారపు ముద్దగా నుండును. ఆ యాకారమును జెఱిపి గాజులుగను, గాజులను మార్చి కుండలములుగను చేయఁబడుచున్నది. ఇట్లు 'ఆకృతి' వేఱు వేఱుగఁ గాన నగును. మంతట నొక్కటియే గదా! వి. ఇచట 'ఆకృతి' యనఁగా నాకారము. కాని ద్రవ్య 'ఆ క్రియతే వ్యవచ్ఛిద్యతే అనేన ఇతి ఆకృతిః దేనిచేత ఇత రము లగు వస్తువులనుండి వేఱు చేయఁబడునో యది యాకృతి, ఇది రెండు విధములు - ఒకటి మన కష్టపడు నాకారము. ఇది మాఱుచుం డును - ఇది యనిత్యమైన (దూకృతి. ఈ యాకారము గల కొన్ని వస్తువులకు జూచిన తరువాత నా తెగకుఁ జెందిన వస్తువులయందుఁ గల సమాన ధర్మ మొకటి ఁబూ యాకారముచే వ్యక్తము చేయఁబడును. ఆదియే 'జాతి' గోత్వము- బ్రాహ్మణత్వము - ఘటత్వము మొదలగునది. ఇది నిత్యమైన యాకృతి. ఇట్లు వ్యంజకమగు రూపమునందును, వ్యంగ్యమగు జాతియం దును గూడ నాకృతిశబ్దము వర్తించును. ఇచట భాష్యకారుఁడు మొదటి యర్థమును మును తీసికొని ఆకృతి నశించును, ద్రవ్యము నశింపదు - సిద్ధాంతమును నిరూపించుచున్నాఁడు.
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/78
స్వరూపం