పస్పశాహ్నికము 43 గోవు అని తెలియుఁజేయు గోత్వ మను ధర్మము వ్యక్తము చేయఁ బడును. (ఇది నశించును - అనిత్యము.) 3. ఆకృతి (జాతి) అన్ని గోవులయం దుండు సమాన ధర ర్మము గోత్వము - (వ్యక్తి నశించినను ఇది నశింపక యుండును. నిత్యము). అర్థము నిత్యము అనినచో నిందులో నేది నిత్య మని విమర్శించు చున్నారు. పరబ్రహ్మ యొక్క సే సత్యమను సిద్ధాంతమున మిగిలిన వన్నియు ననిత్యములే మైనను వ్యవహారదశయందు నిత్యముగా నుండు 'జాతి' నిత్యమని చాలమంది యంగీకరించిరి. - వైయాకరణులు సిద్ధాంతమున శబ్ద మెట్లు స్ఫోటరూపము నిత్యమో, యట్లే యర్థము కూడ బుదిలో బుద్ధిలో భాసించునదియే (బౌద్ధమే) ప్రవాహతః నిత్యమే – అది వ్య క్తియైనను ఆకృతియైనను సరియే. మన యింద్రియములకు గోచరించునది శబ్ద ప్రతిపాద్యమై శాబ్దబోధలో విషయమగు నర్థము కాదు. దానిచే బుద్ధిలో భాసించు నర్థమే యర్థము. అది నిత్యము. శబ్ద ముచ్చరింపఁగనే మన బుద్ధిలో అర్థము ఎల్లపుఁడు భాసించు చుండును. ఆ భాసించు నర్థము ఎల్లపుడు నొక టీయే కాకపోయినను నొ కేవిధముగా నుండును. నీకు మాఱుచుండి నను ప్రవాహము ఎడ తెగక పాఱుచో నెట్లది నిత్యముగనే భావింపఁ బడునో యస్లే బుద్ధిలో భాసించు నర్థమును నాకేవిధముగా నుండుటచే నిత్యమే. దీనిని ప్రవాహ నిత్యత యందురు. ఆకృతి మిత్యాహ| కుత ఏకత్ ? ఆకృతికై నిత్యా ద్రవ్య మనిత్యమ్ ॥ అ. 'అకృతి' యే పదమున కర్థము అని తలంచితిమి. 'ఆకృతి' నిత్యము ' దన్యము' అనిత్యమే కదా!
పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/76
స్వరూపం