పాతజ్జ అ మహా భాష్య :
నిత్యము మాటలాడు నాఁడు" అను చోట్ల 'నిత్యము' అనునది 'ఎల్ల పుడు' నను నర్థము నిచ్చును. నిత్యశబ్దము నుపయోగించినను సిద్ధశబ్దమునకు వలెనే వ్యాఖ్యా నము చేతనే ప్రస్తుతార్థమును నిర్ధరింపవలెను. కావుననే యాచార్యులు మంగళము కూడ సాధింపఁబడునని సిద్ధశబ్దమునే ప్రయోగించి వ్యాఖ్యానముచే నిత్యపర్యాయ మని గ్రహింపఁ జేసినారు. అథ కం పునః పదార్థం మత్వా ఏష విగ్రహః క్రియతే సిద్ధే కట్టే అర్ధ సంబంధే చేతి ? అ, శబ్దార్థ సంబంధములు నిత్యములు, శబ్దము, అర్ధము, సంబం ధము అనునవి నిత్యములు అని చెప్పునప్పుడు అర్థము కూడ నిత్య మనుచున్నారే! అర్థ మన మీ యభిప్రాయమున నేది ? వి. 'శబ్దార్థసంబంధము' అనునది ద్వంద్వ సమాసము. ఇందు మూఁడుపదములకు ద్వంద్వమా? లేక రెండు పదములకు ద్వంద్వమా ? యనునది ప్రశ్న. శబ్దము, అర్థము, సంబంధము అను మూఁటికిని సము-హారద్వంద్వము చేసిన శబ్దార్థసంబంధము అనురూప మగును. కాని యిట్లు చేయుట కొక సందేహము. అర్థము నిత్యమా? కాదా? యని. స్ఫోటరూపమను శబ్దము నిత్యమే గనుక శబ్దవిషయమున సందే హము లేదు. ఆ శబ్దమునకు అర్థమునకుఁ గల సంబంధము (లేదా త్మ్యము) శబ్దరూపమే యగును కావున నదియు నిత్యమే. ఇంక అర్థము మూఁడు విధములు. 1. వ్యక్తి (ద్రవ్యము) కొమ్ములు తోక గంగడోలు మొ। నానితో గూడిన గోవ్యక్తి. (ఇది నశించునది కావున అనిత్యము.) 2. ఆకృతి - (ఆకారము - సంస్థానము) గోవు యొక్క ఆకా రము అన్ని గోవులయందు కాన్పించు నాకారము. దానిచేత నిది