Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాతజ్ఞం మహా భాష్యము లోకమున అ. “శబ్దార్థ సంబంధములు సిద్ధములు” అనుచోట 'సిద్ధములు' అను పదము అత్యంతసిద్ధము ము లు అను సమాసములో పూర్వపదమగు 'అత్యంత' పదము లోపించినరూప మని తలంపవలెను. “దేవదత్తుఁడు—దత్తుఁడు-సత్యభామ-భామ" మున్నగు పదములలో పూర్వపదమును వదలిన రూపము లున్న విగదా ! వి. శబ్దార్థసంబంధములు అత్యంతసిద్ధములు అసిన నిత్యము అని యర్థము వచ్చును. కార్యము లగు వస్తువులు మునుపు లేకుండి (ప్రాగభావము) ఇపు డుండి, తరువాత లేకుండు (ప్రధ్వంసాభావము) స్వభావముగలవి కావున అత్యంతసిద్ధములు కావు. అథవా “వ్యాఖ్యా నతో విశేషప్రతిపత్తి ర్నహి సందేహా దలక్షణమ్" ఇతి నిత్యపర్యాయవాచినో గ్రహణ మితి వ్యాఖ్యాస్యామః. అ. “సందేహము కల్గినంతమాత్రముననే యొక దానిని లక్ష ణము కాదని వదలరాదు. పెద్దల వ్యవహారము ననుసరించి చేసిన వ్యాఖ్యానమువలన విశేషార్థములను గ్రహింపనగును" అను పరిభాష ననుసరించి యిచటి సిద్ధశబ్దము నిత్యపర్యాయముగ గ్రహింపవలెనని వ్యాఖ్యానింతుము. కింపున రనేన వర్ణ్యేన : కిం న మహతా కంఠేన నిత్యశబ్ద ఏవోపా ర్తయ స్త్రీ న్నుపాదీయమానే.. సందేహః స్యాత్. అ. ఇంత ప్రయత్నించి వ్యాఖ్యానింపఁదగిన సిద్ధశబ్దము నేల వాడవలెను ? "శబ్దార్థ సంబంధములు నిత్యములు” అని నిత్యశబ్దమునే స్పష్టముగా నేల పయోగింపరాదు ? అట్లయిన సందేహమే యుండదుకదా? మాంగలిక ఆచార్యో మహతః శాస్త్రాఘస్య మంగలార్థం సిద్ధశబ్ద మాదితః ప్రయుం క్తే మంగలాదీనిహిశాస్త్రాణి 1